KMR: SP రాజేష్ చంద్ర శుక్రవారం పోలీసు కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇటీవల వరదల సమయంలో సిబ్బంది చేసిన కృషిని ముఖ్యమంత్రి స్వయంగా అభినందించారని గుర్తు చేశారు. ఉత్తమ పని తీరుకు రివార్డులు, తప్పులకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.