KDP: రాబోయే నాలుగు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. ముఖ్యంగా ఇవాళ కడప, అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.