అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. కొడవలూరు మండలం వడ్డిపాలెంలో కురిసిన వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. ఐదు నెలల శ్రమ వృథా కావడంతో రైతులు ఆవేదన చెందారు. ఇదే సమయంలో దళారులు తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారు. గిట్టుబాటు ధర దక్కక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు కనీసం పెట్టుబడులైనా రావాలని కోరుతున్నారు.