TG: రాష్ట్రంలో BJP ప్రభుత్వం వస్తే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా గల్లీగల్లీలో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వర్గానికి భయపడి విమోచన దినోత్సవంపై వివాదం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.