»Best Performance Of Rr Bowlers Srh Lost The Match 4th Ipl Match 2023
IPL 2023: RR బౌలర్ల ప్రదర్శన అదుర్స్.. SRH దారుణ ఓటమి
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు(Rajasthan Royals)..సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad)పై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 8 వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నాలుగో గేమ్ ఆదివారం (ఏప్రిల్ 2) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన మ్యాచులో హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆ క్రమంలో మొదట ఆటకు దిగిన రాజస్థాన్ ఆటగాళ్లు 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి గాను 203 పరుగుల అద్భుతమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ క్రమంలో SRH ఛేజింగ్ కోసం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్‌తో 204 రన్స్ ఛేదన కోసం కష్టపడినా కూడా Sunrisers Hyderabad గెలువలేక పోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్ష్యాన్ని ఛేదించలేక ఎనిమిది వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ క్రమంలో రాజస్థాన్(Rajasthan Royals) బౌలర్లు అద్భుతంగా రాణిేంచారు.
యుజ్వేంద్ర చాహల్ ఏకంగా నాలుగు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్ రెండు, జాసన్ హోల్డర్, ఆర్ అశ్విన్ తలా ఒక వికెట్ పడగొట్టి మంచి ప్రదర్శన కనబర్చి మ్యాచ్ గెలుపుకు తోడ్పాటునందించారు.
అయితే SRH ఆటగాళ్లలో ఆత్యధికంగా అబ్దుల్ సమద్ 32, మయాంక్ అగర్వాల్ 27, ఉమ్రాన్ మాలిక్ 19, రషీద్ 18, బ్రూక్ 13 పరుగులు మాత్రమే చేయగా…మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారని చెప్పవచ్చు.