GTకి బిగ్ షాక్: ఐపీఎల్ నుంచి కేన్ విలియన్ సన్ ఔట్..?
ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్‌లో బోణీ కొట్టి ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియన్ సన్ జట్టుకు దూరం అవనున్నారు. నిన్నటి మ్యాచ్‌లో బాల్ ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డ సంగతి తెలిసిందే.
Kane Williamson Out:ఐపీఎల్ 2023 (ipl) ఫస్ట్ మ్యాచ్‌లో బోణీ కొట్టి ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్‌కు (GI) షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియన్ సన్ (Kane Williamson) జట్టుకు దూరం అవనున్నారు. నిన్నటి మ్యాచ్‌లో బాల్ ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డ సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడటంతో వెంటనే చికిత్స అందించారు. కానీ అతను కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందట.. అందుకే ఈ సీజన్ నుంచి దూరం అవనున్నారు.
13వ ఓవర్లో ఐరీస్ ప్లేయర్ జోషువా లిటిల్ వేసిన స్లో లెంత్ బంతిని చెన్నై ఓపెన్ రుతురాజ్ గైక్వాడ్ (RUTURAJ) మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సంగతి తెలిసిందే. అక్కడ ఫీల్డ్‌లో ఉన్న విలియన్ సన్ (Kane Williamson)బంతిని ఆపాడు. బౌండరీ లైన్ దాటక ముందే బంతిని క్యాచ్ చేసి.. వదిలేశాడు. ఆ తర్వాత అతని కుడి కాలు పట్టుకోవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు.
వెంటనే గుజరాత్ (GUJARAT) ఫిజియో అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేశాడు. తర్వాత అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ బంతిని ఆపి కేవలం రెండు పరుగులు మాత్రమే విలియన్ సన్ ఇచ్చాడు.. కానీ మ్యాచ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. మ్యాచ్ తర్వాత కేన్ గురించి గుజరాత్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా (HARDIK PANDYA) చెబుతూ.. కేన్‌కు తాను మెసేజ్ చేశానని.. స్కాన్ కోసం ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు. స్కాన్ చేసి.. వైద్యులు అతని పరిస్థితి గురించి చెబుతారని పేర్కొన్నారు.
కేన్ మోకాలికి గాయం అయ్యిందని.. ఎంత సమయం పడుతుంది, ఎప్పుడూ జట్టుతో కలుస్తాడనే అంశం తనకు తెలియదని పాండ్యా అన్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇదే విషయాన్ని స్పోర్ట్స్ టాక్ తెలిపింది. ఈ అంశంపై అధికార ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.