టర్కీ (turkey), సిరియాలలో (syria) భూకంప (earthquake) మృతుల సంఖ్య 21,000 దాటింది. భారీ మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు, ఆకలి బాధలు వంటి వివిధ కారణాలతో మరణాలు (death toll) రోజురోజుకు పెరుగుతున్నాయి. భూకంప సహాయక చర్యల్లో అత్యంత ముఖ్యమైన 72 గంటల సమయం ముగియడంతో శిథిలాల మధ్య చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారనే ఆశలు సన్నగిల్లాయి.
టర్కీ (turkey), సిరియాలలో (syria) భూకంప (earthquake) మృతుల సంఖ్య 21,000 దాటింది. భారీ మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు, ఆకలి బాధలు వంటి వివిధ కారణాలతో మరణాలు (death toll) రోజురోజుకు పెరుగుతున్నాయి. భూకంప సహాయక చర్యల్లో అత్యంత ముఖ్యమైన 72 గంటల సమయం ముగియడంతో శిథిలాల మధ్య చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారనే ఆశలు సన్నగిల్లాయి. సహాయక చర్యలు వేగంగా కొనసాగిస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతుల సంఖ్య పెరుగుతోంది. టర్కీలో దాదాపు 18,000, సిరియాలో సుమారు 3500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య ఇరవై ఒక్కవేలు దాటింది. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే సమాచారం అంత సులభమైనది కాదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. చిన్న చిన్న ప్రకంపనల కారణంగా వివిధ దేశాలకు చెందిన సహాయక సిబ్బందికి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. బాధితులకు ఉండటానికి, తినడానికి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా, భూకంపం సమయంలో ఓ శిశువు జన్మించిన విషయం తెలిసిందే. ఆమెకు ఆయా అని పేరు పెట్టారు.
భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న టర్కీ, సిరియాలకు (turkey syria earthquake) అమెరికా (America), భారత్ (India) సహా వివిధ దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. భారత్ ఇప్పటికే ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా ఆరు విమానాలలో రిలీఫ్ మెటిరీయల్‌ను, సహాయక సిబ్బందిని పంపించింది. భారత సేవాదళ్ అందించిన సాయానికి ఓ టర్కీ మహిళ.. ఇండియన్ ఆర్మీ సిబ్బందికి ఒకరికి ప్రేమతో ముద్దు పెడుతున్న దృశ్యం అందరినీ కదిలిస్తోంది. మరోవైపు, టర్కీ, సిరియాలకు అమెరికా 85 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. చైనా 82 మందితో కూడిన సహాయక సిబ్బందిని బుధవారం పంపించింది. ఎర్త్ క్వేక్ రిలీఫ్ ఫండ్‌గా ప్రపంచ బ్యాంకు 1.78 బిలియన్ డాలర్ల సహాయాన్ని టర్కీకి అందిస్తోంది. టర్కీలోనే 1,10,000 రెస్క్యూ సిబ్బంది, 5500 వాహనాలు పని చేస్తున్నాయి. ఇందులో ట్రాక్టర్లు, క్రేన్లు, బుల్డోజర్లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలు సహకారాన్ని అందిస్తున్నట్లు టర్కీ వెల్లడించింది.
టర్కీ, సిరియాలలో గత రెండు దశాబ్దాల్లో భూకంపం కారణంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజా భూకంపం రిక్టర్ స్కేల్ పైన 7.8తో వచ్చింది. గతంలో 1939లో ఇంతటి ప్రభావంతో భూకంపం సంభవించింది.
టర్కీలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారత్‌కు చెందిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) శిథిలాల కింద నలిగిపోతున్న ఆరేళ్ల బాలికను కాపాడాయి. మన దేశానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరగకుండా సహాయసహకారాలు అందిస్తున్నాయి. భారత్‌కు చెందిన సహాయక బృందం నర్దగి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను కాపాడిందని, ఎన్టీఆర్ సహాయానికి తాము ఎంతో గర్విస్తున్నామని అమిత్ షా ట్వీట్ చేశారు. టర్కీ భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రావిన్స్‌లో చాలామంది హైపోథెర్మియా పరిస్థితుల్లో మరణించినట్లు చెప్పారు. శరీరంలో ఊష్ణం పుట్టే వేగం కంటే, ఊష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉంటే దానిని హైపోథెర్మియా అంటారు. గడ్డ కట్టే చలిలో బాధితుల శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి మరణించారు.