»Tuberculosis Diagnosis Of Tuberculosis With Blood Test
Tuberculosis: రక్త పరీక్షతో క్షయ వ్యాధి నిర్ధారణ
చిన్నారులు ఎక్కువగా క్షయ వ్యాధి బారిన పడుతుంటారు. దీనిని నిర్ధారణ చేయాలంటే పిల్లల నుంచి కఫం శాంపిల్స్ సేకరించాలి. ఇది చాలా కష్టం. ఈక్రమంలో జర్మనీ పరిశోధకులు రక్తపరీక్షతో క్షయ వ్యాధిని నిర్ధారించారు.
Tuberculosis: జీవనశైలి మార్పులు వల్ల లేక ఆరోగ్య కారణాల వల్ల ప్రస్తుతం చాలామంది పిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఏటా లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారు. 5ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎక్కువగా క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధిని సరైన సమయంలో నిర్ధారణ చేయలేకపోవడం లేదా తప్పుగా చేయడం వల్ల పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. సాధారణంగా క్షయవ్యాధిని కఫం లేదా శ్లేష్మం విశ్లేషణల ఆధారంగా నిర్ధారిస్తారు. పిల్లల నుంచి ఈ నమూనాలు తీసుకోవడం చాలా కష్టం. ఒకవేళ శాంపిల్స్ తీసుకున్న ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది.
ఈ నేపథ్యంలో చిన్నారుల్లో క్షయ వ్యాధిని సులువుగా, వేగంగా, కచ్చితత్వంతో నిర్ధారించే ర్యాపిడ్ బ్లడ్ టెస్ట్ కిట్లను జర్మనీలోని లుడ్విన్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ (ఎల్ఎంయూ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరీక్షలో వేలికొన నుంచి సులభంగా రక్తనమూనాను తీసుకోవచ్చు. దీనివల్ల ఫలితాలు త్వరగా వస్తాయని నిర్ధారణ అయ్యింది. అధ్యయనంలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా, మొజాంబిక్, టాంజానియా, మలావిలో క్షయ వ్యాధి లక్షణాలున్న 15ఏళ్లలోపు వయసున్న 975 మంది చిన్నారుల రక్త నమూనాలను ఈ కొత్త ర్యాపిడ్ టీబీ కిట్లతో పరీక్షించారు. ఆ ఫలితాలను నిర్ధారించేందుకు కఫం శాంపిల్స్‌ను విశ్లేషించారు. ఇలా పరీక్షించిన చిన్నారుల్లో 60 మందికి క్షయ వ్యాధి ఉన్నట్టు ర్యాపిడ్ బ్లడ్ టెస్ట్ కిట్లు కచ్చితత్వంతో నిర్ధారించినట్టు పరిశోధకులు తెలిపారు.