»The Whole World Is Trying To Kill Putin Zelenskys Sensational Comments
Zelensky: పుతిన్ ను చంపాలని చూస్తున్నారు
రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్ అధ్యక్షకుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం పుతిన్ ను చంపాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే 21000 వేల మంది రష్యా సైన్యాన్ని హతమార్చామని ప్రకటించారు.
The whole world is trying to kill Putin.. Zelensky's sensational comments
Russia: రష్యాకు ఉక్రెయిన్ లకు మధ్య ఫిబ్రవరి నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సైనికులు బార్డర్లో యుద్ధం చేస్తుంటే ఈ రెండు దేశాల అధ్యక్షులు మాటలతో ఘాటుగా యుద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky) తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పై చేసిన మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఉక్రెయిన్ పై రష్యా(Russia) కిరాయి సైన్యం వాగ్నర్(Wagner) ను పంపిందని, యుద్దంలో ఆ సైన్యాన్ని ఉక్రెయిన్ బలగాలు చిత్తడి చేసినట్లు జెలెన్ స్కీ తెలిపారు. అంతేకాదు ప్రపంచమే పుతిన్ ను చంపాలని చూస్తోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
స్పెయిన్ ప్రధాని కీవ్ పర్యటన సందర్భంగా జెలెన్ స్కీ(Zelensky) స్పానిష్ పత్రికలతో మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో రష్యా కిరాయి సైన్యం అయిన వాగ్నర్(Wagner) భారీగా నష్టపోయిందన్నారు. మా దళాలు దాదాపు తూర్పు ఉక్రెయిన్‌లోనే 21,000 మంది వాగ్నర్ సైనికులను హతమార్చాయి. మరో 80,000 మంది ఆ గ్రూప్ సైనికులు గాయపడ్డారు అని చెప్పుకొచ్చారు. వాగ్నర్ పీఎంసీ భారీగా నష్టపోయిందని, రష్యా సైన్యం ప్రేరేపిత మూకగానే వాగ్నర్ గ్రూప్ ను చూస్తామని జెలెన్ స్కీ అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ మీకు ప్రాణభయం లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జెలెన్ స్కీ(Zelensky) సమాధానం చెబుతూ నిజానికి నా కన్న పుతిన్ కే ఎక్కువ ప్రమాదం ఉందని.. నన్ను కేవలం రష్యా దేశం మాత్రమే చంపాలని చూస్తోంది. కానీ పుతిన్ ను ప్రపంచమే చంపాలని చూస్తోందని అన్నారు. ఇటీవల రష్యాపై వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేయడం, బెలారస్ మధ్యవర్తిత్వంతో వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ ఘటన తరువాత జెలెన్ స్కీ ఈ మాటలు అనడం గమనార్హం.
చదవండి:ileana : బాయ్‌ఫ్రెండ్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఇలియానా !