పైలోస్కు సుమారు 80 కిమీ దూరంలో బోటు తిరగబడింది. ట్యూనీషియా (Tunisia) – ఇటలీ మధ్య సముద్రంలో మునిగిపోవడంతో దాదాపు 37 మంది గల్లంతయ్యారు. వలసదారులతో వెళ్తోన్న ఓ పడవ మధ్యధరా సముద్రం(Mediterranean Sea)లో బోల్తాపడింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూనీషియా పోర్ట్ ఆఫ్ స్పాక్స్ (Port of Spax)నుండి 46 మంది వలసదారులతో ఓ పడవ ఇటలీ(Italy)కి బయలుదేరింది. మధ్యలో బలమైన గాలుల కారణంగా వీరు ప్రయాణిస్తున్న బోటు ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద సముద్రంలో బోల్తాపడింది. ఈ పడవలో ఏడుగురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 37 మంది గల్లంతు కాగా, ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
అంతర్జాతీయ జలాల్లో వెళుతున్న పడవను యూరోపియన్ యూనియన్ (EU) సరిహద్దు ఏజెన్సీ ఫ్రాంటెక్స్‌కు చెందిన విమానం గుర్తించిందని, అందులో ఉన్న వారెవరూ లైఫ్ జాకెట్లు వేసుకోలేదని కోస్ట్‌గార్డ్ (Coast Guard) తెలిపింది.వీరు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన సమయంలో మరో నౌక రావడంతో వీరు ప్రాణాలతో బయటపడినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ పేర్కొన్నారు. ఉపసహారా ప్రాంతం నుండి వచ్చి ట్యూనీషియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై స్థానిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆఫ్రికా(Africa)లో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఆర్థికమాంద్యం కారణంగా అక్కడ జాత్యహంకార దాడులు పెరిగాయి.
దీంతో ప్రజలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ట్యూనీషియా నుంచి మధ్యధరా సముద్రం అంతటా వలసలు పెరిగిపోయాయి.ఇటీవల కాలంలో ట్యునీషియా తీరంలో పడవ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో పేదరికం, సంఘర్షణల కారణంగా ప్రజలు ట్యునీషియా, లిబియా(Libya)ల నుండి యూరప్ వెళ్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు సబ్ పహారా ఆఫ్రికన్ దేశాల నుండి సముద్రం మీదుగా రహస్యంగా సరిహద్దు దాటేందుకు యత్నించిన 501పడవలను కోస్ట్‌గార్డ్ పెట్రోలింగ్ నిరోధించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. 14,406 మంది వలసదారులను రక్షించినట్లు తెలిపింది.
చదవండి :Ashu Reddy: డ్రగ్స్ కేసులో పేరు రావడంపై అషురెడ్డి సీరియస్