Swati Maliwal: ఎంపీ స్వాతీమాలీవాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడు దాడి
ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతీమాలీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు.
Swati Maliwal: ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతీమాలీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నివాసం నుంచి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి ఫోన్లో చెప్పింది. అయితే ఈ దాడి సీఎం సూచనలతో చేశారని ఆమె తెలిపారు. దీంతో వెంటనే పోలీసులు సివిల్ లైన్స్‌లో ఉన్న సీఎం నివాసానికి వెళ్లారు. కానీ అక్కడ ఆమె కనిపించలేదు. కొద్ది సమయం తర్వాత స్టేషన్‌కు వచ్చిన ఆమె తర్వాత ఫిర్యాదు చేస్తా అని వెళ్లిపోయారు.
ఈ దాడి వార్తలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఢిల్లీ సీఎం సహాయకుడు దాడి చేశారని ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి నుంచి పోలీసులకు కాల్ వెళ్లింది. ఇప్పుడు మీకు ఈ విషయాలు గుర్తుకువస్తున్నాయా? కేజ్రీవాల్ అరెస్టుపై ఆమె మౌనం వహించారు. అప్పుడు ఆమె భారత్‌లో లేరని, చాలా రోజుల పాటు స్వదేశానికి తిరిగి రాలేదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.