ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్దనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.జెరూసలెంలోని ఓ ప్రార్థనామందిరంలో సబ్బత్ వేడుకల్లో పాల్గొన్న పౌరులపై పాలస్తీనాకు చెందిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇజ్రాయెల్ దళాలు దుండగుడిని కాల్చి చంపారు. అంతకముందు వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తియన్ శరణార్థుల శిబిరంపై దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైన్యం 9 మందిని కాల్చి చంపింది. అందుకు ప్రతీకారంగా దుందగుడు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇజ్రాయెల్ లో జరిగిన కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు.