భారత్ ముడిచమురుపై అందిస్తున్న రాయితీ రష్యా (Russia) త్వరలో తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం. ప్రతి పీపా చమురుపై బ్రెట్ క్రూడ్‌లో పోలిస్తే 30 డాలర్ల డిస్కౌంట్ అందిస్తుండగా.. అది 4 డాలర్లకు తగ్గనుంది. ఈ నిర్ణయం దేశీయంగా చమురు ధరల(Oil prices)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War) తర్వాత దేశీయ రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోలును 2% నుంచి 44%కు పెంచాయి.భారతదేశం క్రూడాయిల్ అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 105.8 బిలియన్ డాలర్ల వ్యయంతో 193.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ (Crude oil) ను ఇండియా దిగుమతి చేసుకుంది. ఈ కాలంలో దేశం మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 183.3 మిలియన్ టన్నులుగా ఉంది. దేశంలో ముడి చమురు ప్రధానంగా మిడిల్ ఈస్ట్ (Middle East), యూఎస్ (US) నుంచి దిగుమతి అవుతుంది.
రష్యా నుంచి 2021లో ఇండియా కేవలం 12 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే కొనుగోలు చేసింది. ఇది మొత్తం దిగుమతుల్లో 2 శాతం మాత్రమే. అంటే దేశంలో సొంతంగా ఉత్పత్తి చేస్తున్న చమురు కంటే రష్యా నుంచి చేసిన దిగుమతులు చాలా తక్కువ.భారత్‌కు ముడి చమురును బ్యారెల్‌కు 35 డాలర్ల డిస్కౌంట్ అందించేందుకు రష్యా అంగీకరించింది. భారతదేశం రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులను పెంచినట్లయితే.. దేశంలో ధరలు పెంచాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల అంటే విషయంలో వస్తువుల ధరలు పెరగవు. ప్రతి బ్యారెల్‌పై $35 డిస్కౌంట్లను అందిస్తున్న రష్యా… ఇనీషియల్ డీల్ (Initial deal) గా 15 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయాలని భారత్‌ను కోరుతోంది. కమోడిటీస్ రీసెర్చ్ గ్రూప్ Kpler డేటా ప్రకారం, భారతదేశం జనవరి, ఫిబ్రవరిలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోలేదు. అయితే యురల్స్ గ్రేడ్ చమురు కోసం మార్చి, ఏప్రిల్ ఒప్పందాలు ఆరు మిలియన్ బ్యారెళ్లను ఇప్పటికే దాటిపోయాయి.