Congress defeated in Telangana elections 2023 Victory in Aswaraopeta and yellandu
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలోని గులార్లో ప్రమాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి నదిలో బోల్తా పడిందని ఎస్డిఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పదకొండు మంది ప్రయాణికుల్లో ఐదుగురిని రక్షించినట్లు వారు తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే గల్లంతైన వారిలో విజయవాడకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలిసింది. వారు హైదరాబాద్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లినట్లు సమాచారం. అయితే నిన్నటి నుంచి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
#WATCH | Uttarakhand: Five out of eleven passengers rescued after a vehicle rolled downhill in Gular in district Tehri. Search operation for six other passengers underway: SDRF pic.twitter.com/UYFIyXzHEa