»Reverses Ageing Chemical Ready To Reduce Age Harvard Scientists Announcement
Reverses Ageing: వయసును తగ్గించే కెమికల్ రెడీ..హార్వర్డ్ శాస్త్రవేత్తల ప్రకటన
మనుషులు నిత్యం యవ్వనంగా ఉంటే చాలా బావుంటుంది కదా. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వృద్ధాప్యఛాయలు రావడం సహజం. దీనికి శాస్త్రవేత్తలు అద్భుతమైన సొల్యూషన్ కనుగొన్నారు. నిత్యం యవ్వనంగా కనిపించే కాక్టెయిల్ను కనుగొన్నారు.
వయసు పెరిగేకొద్దీ శరీరంలో అనేక మార్పులొస్తాయి. బాడీలో వృద్ధాప్యఛాయలు కనిపించడం సహజమే. అయితే వయసు పెరిగినా శరీరం నిత్య యవ్వనంగా ఉండేందుకు శాస్త్రవేత్తలు చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆ పరిశోధనలకు సంబంధించి హార్వర్డ్ శాస్త్రవేత్తలు(Harvard Researchers) గుడ్ న్యూస్ చెప్పారు. వయసును తగ్గించే(Reverses Ageing) కెమికల్ కాక్టెయిల్ను తాము రూపొందించామని ప్రకటించారు. తమ పరిశోధనలకు సంబంధించిన విషయాలు ఏజింగ్ జర్నల్లో ప్రచురితమయ్యాయని తెలిపారు.
జీన్ థెరపీ ద్వారా వయసు తగ్గించొచ్చని(Reverses Ageing) శాస్త్రవేత్తలు కొనుగొన్నట్లు తెలిపారు. అయితే తాజాగా కెమికల్ కాక్టెయిల్స్(Chemical Cocktail) ద్వారా కూడా వయసు తగ్గించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శరీరాన్ని పునరుజ్జీవంగా ఉంచేలా అది సాయపడుతుందన్నారు. దీనికి సంబంధించి హార్వర్డ్ పరిశోధకులు డేవిడ్ సిన్క్లయిర్ ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడించారు.
ప్రతి కెమికల్ కాక్టెయిల్(Chemical Cocktail)లోనూ ఐదు నుంచి ఏడు ఏజెంట్స్ ఉంటాయని, అవి శారీరక, మానసిక రుగ్మతల చికిత్సకు వినియోగించేవని అన్నారు. కణాల వయసును తగ్గించి, వాటిని పునరుజ్జీపజేసే మాలెక్యూల్స్ను తాము మూడేళ్లు కష్టపడి కనుగొన్నట్లు తెలిపారు. మెదడు కణజాలం, కిడ్నీ, కండరాలపై చేసిన పరిశోధనల్లో తమకు మంచి ఫలితాలు వచ్చాయని, తాము తమ పరిశోధనలను మొదటగా కోతులు, ఎలుకలపై ప్రయోగించినట్లుగా వెల్లడించారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.