ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అంటే అందరూ చెప్పే పేరు చైనా… కానీ ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న భారత్ డ్రాగన్ దేశాన్ని దాటేసి టాప్ లోకి వచ్చేసింది (India’s population to overtake China). తాజా యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం 142.57 కోట్ల జనాభా ఉన్న చైనాను (China, with a population of 142.57 crore) భారత్ 142.86 కోట్లతో దాటేసింది (India With 142.86 crore people). చైనా కంటే మన దగ్గర 29 లక్షల అధిక జనాభా కలిగి ఉంది. 1950లో ఐక్య రాజ్య సమితి జనాభా సమాచారాన్ని వెల్లడిస్తోంది.
నాటి నుండి మన దేశం తొలిసారి అగ్రస్థానంలోకి వచ్చింది. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. ఐరాస వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 ప్రకారం గత ఏడాది నవంబర్ 15న ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. 1990లో చైనా జనాభా 114.4 కోట్లు కాగా, భారత జనాభా 86.1 కోట్లు. గత ఏడాది నాటికి భారత జనాభా 141.2 కోట్లకు చేరుకోగా, చైనా జనాభా 142.6 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. జైనా జనాభా మాత్రం 131.7 కోట్లకు తగ్గుతుందట.
జనాభా పరంగా భారత్ చైనాను దాటి అగ్రస్థానానికి రావడంపై డ్రాగన్ దేశం స్పందించింది. దీనిని ఆ దేశం జీర్ణించుకోలేకపోతున్నట్లుగా ఆ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. భారత్ తమను దాటడంపై చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ… అదేం పెద్ద విషయం కాదని, క్వాంటిటీ కాదని, క్వాలిటీ ముఖ్యమన్నారు.