బాధ్యతగల చట్టసభ సభ్యులే వీధి రౌడీల్లా బాహాబాహీకి తలపడ్డారు.
వైద్య రంగంలో అద్భుతం జరిగింది. తెగిన తలను తిరిగి వైద్యులు అతికించారు. ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని ఆపరేషన్ చేసి ఓ బాలుడి ప్రాణాలను కాపాడారు.
ప్రతి సినిమా ఇండస్ట్రీలో సమ్మెలు కామన్. ఆ మధ్య టాలీవుడ్‌లో చేసిన సమ్మె కారణంగా.. సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. అయితే టాలీవుడ్ పరిధి తక్కువ కాబట్టి.. నష్టాలు తక్కువనే చెప్పాలి. కానీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు భారీ నష్టం తప్పదంటున్నారు. దాదాపు 63 ఏళ్ల తర్వాత హాలీవుడ్‌లో సమ్మెకు దిగాయి అక్కడి రైటర్స్ గిల్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్.
లాస్ ఏంజల్స్ లోని 35 ఏళ్ల ఈవ్ టిల్లే కౌల్సన్ అనే యువతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు ఓ మంచి హస్బెండ్ కావాలి అని భర్తను వెతికి పెట్టిన వారికి బహుమతిగా రూ. 4 లక్షలు ఇస్తానని ప్రకటించింది.
సాధారణంగా పక్షులకు మాత్రమే వచ్చే బర్డ్‌ఫ్లూ ఇప్పుడు క్షిరదాల్లో వస్తుండడంతో మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రత్తంగా ఉండాలని సూచించింది.
థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో రెండో రోజైన గురువారం భారత అథ్లెట్లు మూడు స్వర్ణాలను గెలుచుకున్నారు. దీంతోపాటు కాంస్య పతకం కూడా కైవసం చేసుకున్నారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి కూడా ఉండటం విశేషం.
రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువ కానుంది. సౌర వ్యవస్థ భారీగా వేడెక్కనుంది. సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ నివేదిక పరిశోధకులకు ఆందోళనను కలిగిస్తోంది.
ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తుంది. 20 లక్షల నుంచే ప్రారంభ ధర ఉన్నట్లు తెలుస్తోంది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో పర్యటించనున్నారు. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, కేరీ సిమండస్ దంపతులకు తాజాగా మగపిల్లాడు పుట్టాడు. దీంతో బోరిస్ కు ఇది 8వ సంతానం.
నేపాల్‌లో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులతోపాటు పైలట్ చనిపోయారు.
ప్రపంచానికి స్పీడ్ ఇంటర్ నెట్ అందించాలని స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ లింక్ ప్రయోగంతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నట్టు ఓ పరిశోధనలో తేలింది. స్టార్ లింక్ మూలంగా భవిష్యత్తులో ఇతర ప్రయోగాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది.
టీ20 సిరీస్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా మహిళా జట్టు తలపడనుంది.
సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ దీవులకు వెళ్లే పడవలో 300 మంది వలసదారులు అట్లాంటిక్ మహాసముద్రంలో అదృశ్యమయ్యారు.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఆంటిగ్వా, బార్బుడా ప్రాంతాల్లో రెండు భూకంపాలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 6.4, 6.6గా నమోదైందని అధికారులు తెలిపారు.