Earthquake: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఆంటిగ్వా, బార్బుడా ప్రాంతాల్లో రెండు భూకంపాలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 6.4, 6.6గా నమోదైందని అధికారులు తెలిపారు.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు.
అయితే ఇప్పటికిప్పుడు సునామీ (Tsunami warning)వచ్చే ప్రమాదం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఆంటిగ్వా (Antigua), బార్బుడాలో (Barbuda) కూడా భారీ భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 2.28 గంటలకు భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత 6.6గా నమోదయిందని, కాడ్రింగ్టన్కు (Codrington) 274 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.