నేడు మహిళల టీ20 మ్యాచ్(Womens T20 Match)లో బంగ్లాదేశ్(Bangladesh)తో టీమిండియా(Teamindia) తలపడనుంది. తొలి టీ20(T20) మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించింది. మంగళవారం రెండో మ్యాచ్‌లో బంగ్లాతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో భారత మహిళా స్పిన్నర్లు విజృంభించారు. సీనియర్లు అయిన హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన దూకుడుగా ఆడారు. దీంతో టీమిండియా సునాయాసంగా నెగ్గింది.
That's that from the 1st T20I.
A convincing 7-wicket win in the first T20I over Bangladesh and #TeamIndia take a 1-0 lead in the series.
Captain @ImHarmanpreet (54*) hits the winning runs as we win with 22 balls to spare.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా(Team India) విజయాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అందుకోసం హర్మన్ బృందం కష్టపడుతోంది. మరోవైపు ఈ సిరీస్‌ను సమం చేయాలని బంగ్లా ప్లేయర్లు(bangladesh Players) ప్రయత్నిస్తున్నారు. గత మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. నేటి మ్యాచ్‌లోనైనా వారు సత్తాచాటాలని అందరూ ఎదురుచూస్తున్నారు.