లాస్ ఏంజల్స్ లోని 35 ఏళ్ల ఈవ్ టిల్లే కౌల్సన్ అనే యువతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు ఓ మంచి హస్బెండ్ కావాలి అని భర్తను వెతికి పెట్టిన వారికి బహుమతిగా రూ. 4 లక్షలు ఇస్తానని ప్రకటించింది.
If Eve Tilley finds a husband for Coulson, they will give a reward of 4 lakhs
Viral News: సాధరణంగా ప్రతి వ్యక్తికి పెళ్లీడు వచ్చాకా మనసు ఒక తోడును కోరుకుంటుంది. అందుకే చాలా మంది పెళ్లీ చేసుకోవడమో లేదా సహజీవనం చేయడమో జరుగుతుంది. అయితే ఓ యువతి చాలా మందితో డేటింగ్ చేసినా కూడా అంతగా మజా లేదని తనకు ఓ భర్త కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. లాస్ ఏంజల్స్(Los Angeles) కు చెందిన ఈవ్ టిల్లే కౌల్సన్ అనే టిక్ టాక్(TikTok) మోడల్ ఓ కంపెనీలో కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీగా పని చేస్తుంది. తాను గత 5 ఏళ్లుగా పలువురితో డేటింగ్ చేసింది. ప్రస్తుతం వీటిపై ఆసక్తి తగ్గడంతో ఓ తోడును కోరుకుంటుంది.
చదవండి: Baby Movie Review: బేబీ మూవీ రివ్వ్యూ..హిట్టా ఫట్టా?
35 ఏళ్ల ఈవ్ టిల్లే కౌల్సన్(Eve Tilley-Coulson) కు దాదాపు పది లక్షల ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ వేదికగా తనకు ఓ మంచి హస్బెండ్ కావాలి. తనకు భర్తను వెతికి పెట్టిన వారికి బహుమతిగా 5 వేల డాలర్లు(రూ. 4,10,462) ఇస్తానని ప్రకటించింది. ఇక తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో వివరించింది. తాను మినిమమ్ 5 అడుగుల పైనే ఎత్తు ఉండాలి. 27 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వ్యక్తి కావాలి. డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉండకూడదు. పిల్లలను, జంతువులను, ఆటలను ఇష్టపడాలి. అవతలివారిని అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి అని పేర్కొంది. దీనితో పాటు ఓ షరతు కూడా పెట్టింది. అదేంటంటే పెళ్లి చేసుకున్న తరువాత కేవలం 20 సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటానని, తరువాత అతనికి విడాకులు ఇచ్చేస్తానని చెప్పుకొచ్చింది. గతంలో హీల్స్ ధరించొద్దని తన డేటింగ్ పార్ట్నర్స్ చెప్పేవారని అది తనకు ఇష్టం లేదని తెలిపింది. ఇక రిజిస్ట్రేషన్ ఫైల్‌పై సంతకం చేసిన తర్వాతపెళ్లి సంబంధం చూసిన వ్యక్తికి బహుమతి అందిస్తానని చెప్పింది.