గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్లో రాబోతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ సిద్ధమైంది కానీ, సాంగ్ షూట్ చేసి, ఆ విజువల్స్‌ను లిరికల్ వీడియోలో యాడ్ చేయాలని ప్లాన్ చేయడంతో విడుదల ఆలస్యం అవుతోందని సమాచారం. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్నారు.