కొత్తగా మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల పురుషుడు MERS (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్-సంబంధిత కరోనావైరస్) బారిన పడిన తరువాత అబుదాబిలోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
పాకిస్థాన్ అడుక్కోవడం మానేయ్యాలని ఆ దేశ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్ అన్నారు. ఇప్పటికే పాక్ చేస్తున్న తప్పుల వలన భవిష్యత్తు చీకటిగా మారుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తన నివేదికలో పేర్కొంది.
ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్ట్ ఇండిస్‌పై భారత్ పై చేయి సాధించింది. ఇప్పటికే మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో కూడా దూకుడు ప్రదర్శించింది. కానీ వర్షం కారణంగా గెలుపునకు అడ్డుకట్ట పడింది.
ఆసియా ఛాంపియన్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు ఆదివారం కొరియాలోని యోసులో జరిగిన కొరియా ఓపెన్ 2023 టైటిల్‌ను గెల్చుకున్నారు. 17-21, 21-13, 21-14తో 1 ఇండోనేషియా ద్వయం ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోను ఓడించారు.
రష్యా(russia) ఫార్ ఈస్ట్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలం బటగైకా క్రేటర్ కరిగిపోతోందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ “మెగా స్లంప్”(మంచు బిలం) కారణంగా ఇప్పటికే ఉత్తర, ఈశాన్య రష్యాలోని నగరాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.