»Pakistan Should Stop Begging Army Chief General Asim Munir
Asim Munir: పాకిస్థాన్ అడుక్కోవడం మానేయ్యాలి!
పాకిస్థాన్ అడుక్కోవడం మానేయ్యాలని ఆ దేశ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్ అన్నారు. ఇప్పటికే పాక్ చేస్తున్న తప్పుల వలన భవిష్యత్తు చీకటిగా మారుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తన నివేదికలో పేర్కొంది.
Pakistan should stop begging. Army Chief General Asim Munir
Army Chief: పాకిస్థాన్(Pakistan) చైనా(China) కు ఉన్న సంబంధాలు తెలిసినవే. మరో భారీ రుణం అందుకోవడానికి సిద్ధమైన సమయంలో ఆర్మీచీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ విదేశీ రుణాలపై ఆధారపడటాన్ని మానేసి, సొంత కాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని ఆ దేశ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్(Army Chief General Asim Munir) పేర్కొన్నారు. ఖానేవాల్ మోడల్ అగ్రికల్చర్ ఫామ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్థాన్ యువకులు, పెద్దలు ఉత్సాహవంతులు, ప్రతిభా వంతులు, గర్వించదగినవారని చెబుతూ.. కచ్చితంగా బెగ్గర్స్ బౌల్(చిప్పను) విసిరేయాలని తెలిపారు. పాకిస్థాన్ ప్రగతిని ఏ దేశం ఆపలేదని ఈ గడ్డపై పుట్టిన వారికి భగవంతుడు అన్ని రకాల శక్తులు ఇచ్చారని వాటిని ఉపయోగించుకొని దేశం ముందుకు సాగాలన్నారు.
దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని, త్వరలోనే పూర్తి సంక్షోభం నుంచి బయటపడేలా ఆర్మీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అతి త్వరలోనే పాక్ ఓ వ్యవసాయ విప్లవాన్ని చూస్తుందని, దేశం మొత్తం మోడల్ ఫామ్లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇవి చిన్న రైతులకు ఆధునిక సేద్యంలో సాయం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ఇటీవల ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరో 600 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఒక్క జులై నెలలోనే పాక్ ప్రభుత్వం మొత్తం 2.44 బిలియన్ డాలర్ల మేరకు అప్పు చేసింది. వీటిల్లో చైనా నుంచి తెచ్చుకొన్న 2.07 బిలియన్ డాలర్లు ఉన్నాయని గుర్తు చేశారు.
ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్(Moodies is an international rating agency) తన నివేదికలో పాక్ కష్టాలను, ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ప్రస్తావించింది. భవిష్యత్లో పాక్ ఇంకెలాంటి భయంకరమైన ఎదుర్కొబోతుందో వివరించింది. తాజా ఆర్థిక సంవత్సరంలో అసలు, వడ్డీ కలిపి పాకిస్థాన్ 25 బిలియన్ డాలర్ల మేర చెల్లించాల్సి ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో చెల్లింపు ప్రక్రియ వాయిదా పడింది. రానున్న రోజుల్లో పాక్కు ఇది మరింత భారంగా తయారవుతుందని మూడీస్ పేర్కోంది. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్థాన్ నడుచుకోవాలని మూడీస్ వెల్లడించింది.