Samantha: సమంత (Samantha).. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా సరే వార్తల్లో నిలుస్తోంది. మయాసైటిస్ అనే వ్యాధి బారినపడిన ఆమె.. చికిత్స కోసం అమెరికా వెళ్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం ఇండోనేషియాలో చక్కర్లు కొడుతోంది. మెడికల్ ట్రీట్మెంట్ కాక.. మెడిటేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే బాలి దీవుల్లో.. జలపాతాల మధ్య ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫోటోలను ఇన్ స్ట్రాగ్రామ్లో షేర్ చేసింది.
బాలి పర్యటనలో సామ్ చాలానే ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫోటోలో ఒకటి సమంత (Samantha) టోపీ మీద ‘కల మొదలైంది’ అనే పదం ఉంది. మరో పిక్ యోగా ముద్రని చూపిస్తూ కనిపించింది. ఇలా ఆ ఫోటోలు.. వాటి క్యాప్షన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. సామ్ ఇలా ఎందుకు పెట్టింది..? దాని వెనక కారణం ఏంటీ అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
సామ్ ఖుషీ మూవీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాగా.. సెప్టెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సిటాడెల్ హిందీ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. అదీ ఎప్పుడూ ఓటీటీలోకి వస్తుందనే విషయం క్లారిటీ లేదు. స్థిరాస్థుల కొనుగోలుపై సమంత (Samantha) ఆసక్తి కనబరుస్తారు. ఇటీవల కూడా ఓ ఇల్లు కొనుగోలు చేశారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత (Samantha) వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఓ సమయంలో మయాసైటిస్ వ్యాధికి గురయ్యారు.