»The Biggest Ice Crater Batagaika That Is Melting Russia Who Is The Danger
Batagaika: కరిగిపోతున్నఅతిపెద్ద మంచు బిలం..ఎవరికి ప్రమాదం?
రష్యా(russia) ఫార్ ఈస్ట్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలం బటగైకా క్రేటర్ కరిగిపోతోందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ “మెగా స్లంప్”(మంచు బిలం) కారణంగా ఇప్పటికే ఉత్తర, ఈశాన్య రష్యాలోని నగరాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
రష్యా సైబీరియాలోని బటగైకా(Batagaika) క్రేటర్ పెర్మాఫ్రాస్ట్ దీనిని “మౌత్ టు హెల్”(మంచు బిలం) (ice crater) అని కూడా పిలుస్తారు. బటగైకా క్రేటర్ అనేది భూమి ఉపరితలంలో 282 అడుగుల లోతైన గ్యాపింగ్ రంధ్రం. ఇది పాతాళానికి ఒక మార్గం అని స్థానికులు నమ్ముతారు. ఇది రోజురోజుకు పెరగడం వల్ల అక్కడ ఉన్న జీవరాశులకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజురోజుకు వేడెక్కుతున్న వాతావరణం కారణంగా ఇది కరిగిపోయి విస్తరిస్తుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో అటవీ నిర్మూలన ఫలితంగా 1960లలో ఈ బిలం కనిపించడం ప్రారంభమైంది. నేల కోతకు గురైనప్పుడు ఇవి ఏర్పడ్డాయి. ఇది క్రమంగా పెరగడంతో అటవీ నిర్మూలనతోపాటు నేలను కోల్పోవడానికి దారితీసింది. దీని వలన భూమి మరింత కోతకు గురవుతుంది. దీంతో ఉత్తర, ఈశాన్య రష్యాలోని నగరాలు పట్టణాల్లోని స్థానికులు భయాందోళన చెందుతున్న చెబుతున్నారు.
రష్యా(russia) రిపబ్లిక్‌లోని కొంతమంది స్థానికులు దీనిని “అండర్ వరల్డ్ గేట్‌వే” అని కూడా పిలుస్తారు. దీనికి శాస్త్రీయ పేరు ఉంది: మెగా-స్లంప్. ఈ దృగ్విషయం ప్రమాదానికి సంకేతమని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది క్రమంగా పెరగడం వల్ల రోడ్‌వేలను, ఇళ్లను విభజించిందని, దీంతోపాటు పైప్లైన్లకు అంతరాయం కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. ఇటీవలి సీజన్లలో ఇది మరింత తీవ్రంగా మారి విస్తరిస్తుందని వాపోతున్నారు. ఇది 1970లలో మొదట లోయగా అభివృద్ధి చెందిందని..తర్వాత ఎండ వేడిమికి కరిగిపోవడం ద్వారా అది విస్తరించడం ప్రారంభించిందని స్థానికులు చెబుతున్నారు.
ఇది అధిక గాలి ఉష్ణోగ్రతల(temperature) ద్వారా వాతావరణం వేడెక్కడంతోపాటు మానవజన్య ప్రభావం ద్వారా వ్యాప్తి చెందుతుందని మెల్నికోవ్ పెర్మాఫ్రాస్ట్ ఇన్స్టిట్యూట్లో ప్రధాన పరిశోధకురాలు నికితా తననాయేవ్ అన్నారు. భవిష్యత్తులో, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అధిక మానవజన్య పీడనంతో ఈ మెగా-స్లంప్లు మరింత ఎక్కువగా పెరగవచ్చన్నారు. ఈ బిలం ఎంత వేగంగా విస్తరిస్తుందనేది శాస్త్రవేత్తలకు ఖచ్చితంగా తెలియదన్నారు. కానీ రష్యా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే కనీసం 2.5 రెట్లు వేగంగా వేడెక్కుతుందని వారు హెచ్చరించారు.
A gash that is nearly two-thirds of a mile long in Russia's Far East forms the world's largest permafrost crater, and as the planet warms, it is getting bigger and bigger https://t.co/2teksBQnc8pic.twitter.com/Z1Nlvu9xVa