అమెరికా సర్కార్ హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించింది. విదేశీ కార్మికులు, ఎఫ్-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను మార్చడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకుంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత ఇస్లామాబాద్ చేరుకున్నారు. దుబాయ్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత నవాజ్ షరీఫ్ ప్రత్యేక విమానం ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగింది. ఇక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది.
ఐర్లాండ్‌లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి. తెలంగాణ ఎన్నారైలు నిర్వహించిన ఈ సంబరాలకు సుమారు 850 మంది పాల్గొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఈ క్రమంలోనే వైద్య సదుపాయాలు ప్రమాదంలో పడ్డాయి. చాలా శాఖలు కరెంటు లేకుండా పని చేస్తున్నాయి.
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ లో కూడా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒకటి రెండు కాదు మూడు ఫ్రంట్‌లు ఒక్కటయ్యాయి.
ఇటాలియన్ మహిళా ప్రధాన మంత్రి జార్జియా మెలోని(Giorgia Meloni) శుక్రవారం ఆమె తన చిరకాల బాయ్ ఫ్రెండ్, జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనో నుంచి విడిపోయినట్లు ప్రకటించారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా అతను మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకే మెలోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ప్రపంచంలో ఖరీదైన విస్కీని సోథెబి సంస్థ వేలం వేయనుంది. నవంబర్ 1వ తేదీ నుంచి బిడ్డింగ్ వేయాలని.. 18వ తేదీన వేలం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఆ బాటిల్‌కు భారత కరెన్సీలో రూ.12 కోట్లు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. కానీ హమాస్, రష్యా చేసే దాడులకు ఎప్పుడూ తమ మద్దతు తెలపలేమని అన్నారు. రెండు వేర్వేరు అయినా కూడా వారి ఇద్దరి అజెండా ఒకటేనని హమాస్, రష్యాపై బైడెన్ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావానికి ఎలాన్ మస్క్ ఒక్క రోజే భారీ నష్టాన్ని చవిచూశారు
ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్దం జరుగుతోంది. ఈ సమయంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆ దేశ ప్రధానిని కలిశారు. ఈ యుద్దంలో ఇజ్రాయెల్ గెలవాలని కోరారు. బ్రిటన్ పూర్తి మద్దతు ఇజ్రాయెల్‌కు ఉంటుందని ప్రకటించారు.
త్వరలో అంతరిక్షంలో 10 లక్షలకు పైనే శాటిలైట్స్ చేరుకోనున్నాయి. దీని వల్ల అంతరిక్షంలో ఒక గ్రహంతో పాటు మరో గ్రహం ఢీకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
మేయర్‌గా ఉన్న భారత సంతతి సిక్కు వ్యక్తికి గుర్తు తెలియని దుండగులు చంపేస్తామంటూ బెదిరింపు ఇ-మెయిల్ పంపించడం కలకలం సృష్టిస్తోంది.
గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 500 మంది మరణించారు. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ఈ దాడి జరిగింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) తన సంఘీభావాన్ని తెలియజేయడంతోపాటు ఆయా నాయకులతో యుద్ధ ఆందోళన గురించి చర్చించడానికి ఇజ్రాయెల్ చేరుకున్నారు. బుధవారం టెల్ అవీవ్‌లో దిగిన ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘనస్వాగతం పలికారు.
ఉక్రైన్‌తో యుద్ధం తరువాత మొదటిసారి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మంగళవారం బీజింగ్‌లో చైనా అధ్యక్షడు తన మిత్రుడికి స్వాగతం పలికారు. ఈ సమ్మిట్‌లో అంతర్జాతీయ శాంతి భద్రతలతో సహా ఇజ్రాయెల్, పాలస్తీనాల యుద్ధంపై కూడా చర్చించారు.