ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిన కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, విధ్వంసాలు ఆగడం లేదు. గత నెల సెప్టెంబర్ నుండి అంటారియో ప్రావిన్స్‌లో కనీసం ఆరు హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి.
అమెజాన్ నింగిలోకి ఉపగ్రహాలను పంపనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3236 శాటిలైట్స్‌ను పంపేందుకు అమెజాన్ ఏర్పాట్లు చేస్తోంది. ఉపగ్రహాలను నింగిలోకి పంపే విషయంలో భారత్ అనుమతుల కోసం అమెజాన్ దరఖాస్తు చేసుకుంది.
జీవితంలో చాలా మందికి ఇల్లు కట్టుకోవడం అనేది ఓ గొప్ప కోరిక. చనిపోయేలోపు సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. అంత పెద్ద కోరికను నెరవేర్చుకోవడానికి ప్రజలు కోటి కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. అలాంటిది ఓ బెడ్ రూ.5కోట్లు అంటే నమ్ముతారా?
ఇజ్రాయెల్‌పై దాడులు జరుగుతున్న వేళ హమాస్ కమాండ్ మహ్మద్ అల్ జహార్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ వృద్ధ జంట తమకు చెందిన ఓ అరుదైన మాస్కును ఓ డీలర్ రూ.13 వేలకు కొనుగోలు చేసి రూ.36 కోట్లకు విక్రయించాడని అతినిపై కేసు వేశారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఆ మాస్క్ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని, అలాగే హింసను ప్రేరేపించేలా ఉన్నా వీడియోలను మెటా ప్లాట్ ఫామ్స్ ప్రచారం చేస్తున్నాయని యూరోపియన్ యూనియన్ మార్క్ జూకర్‌బర్గ్‌ను హెచ్చరించింది.
కొన్ని రోజులుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో చాలామంది గాయపడటంతో పాటు చనిపోయారు. గాయపడిన వారికి అండగా ఉండేందుకు బ్రిటన్ మంత్రి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. ఆ క్రమంలో అతనికి ఓ భయానక సంఘటన ఎదురైంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ దేశాన్ని హెచ్చరించాడు. ఈ వివాదంలో పాల్గొనకుండా దూరంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఓ కార్యక్రమం చేపట్టింది. ఆపరేషన్ అజయ్ పేరుతో నేటి నుంచి అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపింది.
బ్రహ్మోస్ మిస్సైల్ టెస్ట్‌ను భారత వైమానిక దళం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ హర్షం వ్యక్తం చేసింది.
40 మంది చిన్నారుల తలలు నరికి హమాస్ తీవ్రవాదులు క్రూరత్వానికి దెగబడ్డారు. ఈ ఘటన ప్రపంచ దేశాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోలను విడుదల చేసింది.
ఏఐ టెక్నాలజీ ద్వారా చాలా మంది యువత వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్స్‌ను క్రియేట్ చేసుకుని వాటితో జీవిస్తున్నారు. ఈ విధానం ఎక్కువగా అమెరికాలోని యువత పాటిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీని వల్ల మగవారు ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, బర్త్ రేట్స్ కూడా చాలా వరకూ తగ్గిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో పీఎం మోడీ ఈ విషయంపై స్పందించారు. భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ముష్కరులు దారుణాలకు ఒడిగడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు హతమారుస్తున్నారు. ఇజ్రాయెల్ టీవీ యాంకర్ పోస్ట్ చేసిన ఒక ఫోటో నెటిజన్ల హృదయాన్ని కలిచివేస్తుంది. ఎగ్జిక్యూషన్ స్టైల్‌లో తన సోదరిని హమాస్ ఉగ్రవాదుల గుంపు హత్య చేసినట్లు పేర్కొంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మంగళవారం చైనా, యూరో ప్రాంతాల వృద్ధి అంచనాలను తగ్గించింది. కానీ భారత్ వృద్ధి రేటు అంచనాలను మాత్రం ఈ సారి పెంచింది. మరోవైపు ప్రపంచ వృద్ధి తక్కువగా, అసమానంగా ఉందని పేర్కొంది.