»Amazon Will Send 3236 Satellites To Space Application For India Permit
Amazon: 3236 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న అమెజాన్..భారత్ అనుమతి కోసం దరఖాస్తు
అమెజాన్ నింగిలోకి ఉపగ్రహాలను పంపనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3236 శాటిలైట్స్‌ను పంపేందుకు అమెజాన్ ఏర్పాట్లు చేస్తోంది. ఉపగ్రహాలను నింగిలోకి పంపే విషయంలో భారత్ అనుమతుల కోసం అమెజాన్ దరఖాస్తు చేసుకుంది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) తన సేవలను విస్తరించేందుకు సరికొత్త ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే ఈ సైట్ ఎంటర్టైన్మెంట్ (Entertainment) సహా ఇతర రంగాలకు సేవల్ని అందిస్తోంది. తాజాగా మరో రంగంలోకి అమెజాన్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అమెజాన్ రెడీ అవుతోంది. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను (Broad Band Internet Services) అమెజాన్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
భారత్ (India)లో తమ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అమెజాన్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ ఇంటర్నెట్ సేవల కోసం లోయర్ ఎర్త్ ఆర్టిట్‌లో మొత్తంగా 3236 ఉపగ్రహాలను (3236 satelites) ప్రవేశపెట్టేందుకు అమెజాన్ ఏర్పాట్లు చేస్తోంది. 2026 నాటికి చాలా వరకూ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)తో ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగులు వేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో శాటిలైట్ సేవలను విస్తరించేందుకు రెగ్యులేటరీ ఆమోదాన్ని పొందేందుకు అమెజాన్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్లోకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తక్కువ ధరకే జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవల్ని అందించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందించేందుకు అమెజాన్ ఈ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పల్లెకు అమెజాన్ ప్రైమ్ సేవలను విస్తరించే లక్ష్యంతో ఇంటర్నెట్ సేవలను (Internet Services) అందరికీ అందుబాటులోకి తేవాలని అమెజాన్ భావిస్తోంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్స్‌కు భారత ప్రభుత్వం జీఎంపీసీఎస్ అనుమతులు మంజూరు చేయగా త్వరలో వాటి సరసన అమెజాన్ కూడా చేరే అవకాశం ఉంది.