»Mark Zuckerbergs Meta Spreading Misinformation After Hamas Attack Warns Eu
EU Warns: మెటా సీఈఓ జుకర్‌బర్గ్‌పై యూరోపియన్ యూనియన్ సీరియస్
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని, అలాగే హింసను ప్రేరేపించేలా ఉన్నా వీడియోలను మెటా ప్లాట్ ఫామ్స్ ప్రచారం చేస్తున్నాయని యూరోపియన్ యూనియన్ మార్క్ జూకర్‌బర్గ్‌ను హెచ్చరించింది.
Mark Zuckerberg's Meta Spreading Misinformation After Hamas Attack, Warns EU
Warns EU: ఇజ్రాయెల్(Israel)పై హమాస్(Hamas) మిలిటెంట్ల దాడిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఫేస్బుక్(Facebook), ఇన్స్టాగ్రామ్(Instagram) తప్పుగా ప్రచారం చేస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg)ను బుధవారం యూరోపియన్ యూనియన్(European Union) హెచ్చరించింది. తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించాలని యూరోపియన్ కమిషనర్ థియరీ బ్రెటన్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. వారికి సమాధానం చెప్పడానికి యూరోపియన్ చట్టం ప్రకారం మెటా సంస్థకు 24 గంటల సమయం ఉందని తెలిపింది. మెటా సంస్థ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లను కలిగి ఉంది.
యూరోపియన్ కమిషనర్ థియరీ బ్రెటన్ తన లేఖలో.. కంటెంట్ నియంత్రణ బాధ్యతను పూర్తిగా సంస్థ తీసుకోవాలన్నారు. దీన్ని విస్మరించి అనవసరపు కంటెంట్ మెటా సోషల్ మీడియా అకౌంట్లలో ప్రచారం జరుగుతుందని, దీనికి పూర్తి బాధ్యత సంస్థ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన తీవ్రవాద దాడుల వీడియోలను, దానికి సంబంధించిన వార్తలను కొన్ని ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విపరీతంగా షేర్ చేయబడిందని..ఇది E.U. చట్టవిరుద్ధమైన చర్యగా వారు పరగణిస్తున్నట్లు తెలిపారు. దేశానికి సంబంధించిన సెన్సిటీవ్ విషయాలను బయటకు చెప్పే ముందు ఆ దేశ నిబంధనలు దృష్టిలో పెట్టుకోవాలని లేదంటే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామిని హెచ్చరించారు.
యూరోపియన్ చట్టానికి సంబంధించి నిబంధనలను పాటించడంలో మెటా విఫలమైతే కంపెనీ జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వార్షిక టర్నోవర్‌లో 6% వరకు జరిమానా ఉంటుందని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఎక్స్(X) ప్లాట్ ఫామ్ సీఈఓ ఎలన్ మస్క్‌ను కూడా హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడులను గ్రాఫిక్స్ చేసి, లేదా డైరెక్ట్‌గా ప్రచారం చేస్తున్నారని, అలాగే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయని, వాటిని నియంత్రించే పూర్తి బాధ్యత ఆయా కంపెనీలదే అని బ్రెటన్ వెల్లడించారు.