భారత్ సైన్యం మరో అడుగు ముందుకు వేసింది. ముప్పు ఉన్న ప్రాంతాల్లో మరింత సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటోంది. సరిహద్దు దేశాల నుంచి దాడులను ఎదుర్కొనేందుకు మరిన్ని అధునాతన సామాగ్రిని కూడగట్టుకుంటోంది. అందులో భాగంగా తాజాగా నేడు భారత వైమానికి దళం (IAF) తూర్పు ద్వీప సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో బ్రహ్మోస్ మిస్సైల్‌ను పరీక్షించింది. ఇందులో ఎర్త్ టూ ఎర్త్ వెర్షన్‌ను టెస్ట్ చేసి విజయవంతమైంది.
బ్రహ్మోస్ మిస్సైల్‌ను పరీక్షించిన వీడియో:
Bull's Eye !
The #IAF recently carried out a successful test of its Surface to Surface version of the #Brahmos Missile near the Eastern Seaboard archipelago.
ఈ మిషన్ అన్ని లక్ష్యాలను సాధించిందని ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. మిస్సైల్‌కు సంబంధించిన టెస్ట్ ఫైరింగ్‌కు సంబంధించిన వీడియోను ఎయిర్‌ఫోర్స్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ మిస్సైల్ (Brahmos Missile) ద్వారా కిలోమీటర్ దూరంలో ఉండే టార్గెట్‌ను కూడా ఛేదించవచ్చు.
బ్రహ్మోస్ మిస్సైల్ (Brahmos Missile) పిన్‌పాయింట్ కచ్చితత్వంతో టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వైమానిక దళం తెలిపింది. ఈ బ్రహ్మాస్త్రంతో శత్రువుల చర్యలను తిప్పికొట్టొచ్చని వెల్లడించింది. బ్రహ్మోస్ మిస్సైల్ టెస్ట్‌ను విజయవంతంగా ప్రయోగించిన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ ప్రశంసలు కురిపించింది.