»Hamas Commander Mahmoud Al Zahars Key Statement We Will Bring Our Law To The Whole World
Israel vs Hamas: ‘ప్రపంచమంతా మా చట్టమే తీసుకొస్తాం’: హమాస్ కమాండర్
ఇజ్రాయెల్‌పై దాడులు జరుగుతున్న వేళ హమాస్ కమాండ్ మహ్మద్ అల్ జహార్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Israel vs Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. గాజాపై హమాస్ దాడులు చేస్తోంది. యుద్ధంలో చాలా మంది చనిపోయారు. యుద్ధాన్ని పెంచేలా హమాస్ చర్యలకు పాల్పడుతుంది. హమాస్ కమాండర్ తమ సభ్యులకు ఇచ్చిన సందేశం యుద్ధాన్ని మరింత భీకరంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. హమాస్ కమాండ్ మహ్మద్ అల్ జహార్ ఓ వీడియోలో మాట్లాడిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
Israel is only the first target, warns Hamas commander Mahmoud al-Zahar:
"The entire planet will be under our law; there will be no more Jews or Christian traitors.".
“We believe in what our Prophet Muhammad said: “Allah drew the ends of the world near one another for my… pic.twitter.com/fTWa8pqGZB
ఇజ్రాయెల్ ప్రారంభ టార్గెట్ మాత్రమే. యావత్ ప్రపంచమంతా మన చట్టం కిందకు రావాలి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎలాంటి అన్యాయం, అణచివేత లేని వ్యవస్థ ఉండాలి. లెబనాన్, సిరియా, ఇరాక్ వంటి దేశాల్లో అరబ్, పాలస్తినీయన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, హత్యలు ఇంకా ఎక్కడ జరగకూడదని హమాస్ కమాండర్ జహార్ అన్న మాటలు కలకలం రేపుతుంది. లెబనాన్, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ఇంకా కొన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతుంది.
జహార్ వీడియో వైరల్ అయిన కొద్ది గంటలకే.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హమాస్ హెచ్చరిస్తూ కీలక ప్రకటన జారీ చేశారు. హమాస్‌కు వ్యతిరేకంగా యుద్ధం కొనసాగుతుందని.. హమాస్ గ్రూప్‌ను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ సైన్యం ప్రస్తుతం గాజాలో దాడులు చేస్తుంది. త్వరలో పూర్తిగా దాడులు చేయడానికి సిద్ధం అవుతున్నామని నెతన్యాహు హెచ్చరించారు. హమాస్ జైలులో ఇజ్రాయెల్ పౌరులతోపాటు ఇతర పౌరులు బందీలుగా ఉన్నారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ వాళ్లపై దాడికి వెళ్తే బందీలుగా ఉన్నవారిని చంపేస్తామని ఇంతకు ముందే ప్రకటించింది.