Israel-Hamas War: గాజాలో మళ్లీ ఉద్రిక్తత..178 మంది దుర్మరణం
గాజాలో మరోసారి మారణహోమం ప్రారంభమైంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో నేడు ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. ఈ మారణహోమంలో 178 మంది దుర్మరణం చెందారు.
ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం ముగిసింది. దీంతో మళ్లీ గాజాలో నరమేధం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకుపడింది. మారణహోమాన్ని సృష్టించింది. ఈ దాడిలో 178 మంది పాలస్తానీయన్లు మృతిచెందారు. ఈ సమాచారాన్ని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోసారి పాలస్తీనా పౌరులు చనిపోతుండటంతో అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
ఇజ్రాయెల్ చేపట్టిన ఆ దాడులతో గాజాలో మళ్లీ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని యూఎన్ ఏజెన్సీలు వెల్లడించాయి. హమాస్ బందీల్లో కూడా ఐదుగురు చనిపోయారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. మృతుల కుటుంబీకుల్లో ఆందోళన నెలకొంది. హమాస్ బందీల్లో ఉన్నటువంటి 200 మందిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. పరోక్షంగా చాలా మంది ఇరు దేశాల్లో బందీలుగా ఉన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద ఖైదీలుగా ఉన్న 100 మందిని బందీలను విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా తమ దేశ జైళ్లలో ఉన్నటువంటి 240 మంది ఖైదీలను విడుదల చేసింది. ఇలాంటి ఒప్పందం మరికొంత కాలం కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇరు వర్గాల నుంచి ఎలా ప్రకటన వెలువడలేదు. దీంతో మళ్లీ యుద్ధం మొదలై చాలా మంది ప్రాణాలు తీయడానికి కారణమవుతోంది.