»African Old Fang Mask Sold For 3 6 Million France Dealer Z Sale
African old mask: షాకింగ్..పాత మాస్కు రూ.36 కోట్లకు విక్రయం
ఓ వృద్ధ జంట తమకు చెందిన ఓ అరుదైన మాస్కును ఓ డీలర్ రూ.13 వేలకు కొనుగోలు చేసి రూ.36 కోట్లకు విక్రయించాడని అతినిపై కేసు వేశారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఆ మాస్క్ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
african old mask sold for 3.6 million france dealer z sale
ఫ్రాన్స్(france)లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో ఉండే నిమ్స్‌కు చెందిన ఓ వృద్ధ జంట 2021లో తమ ఇంటిని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో వారు గడ్డంతో చమత్కారమైన చెక్క ముసుగు మాదిరిగా ఉన్న ఓ వస్తువును వారి ఇంట్లో చూశారు. అది ఫ్రెంచ్ ఆక్రమిత ఆఫ్రికాలో వలస గవర్నర్‌గా ఉన్న అతని తాత నుంచి ఆ వస్తువు ఆమె భర్తకు పంపబడింది. అయితే దానిని అమ్మేయాలని ఆ వృద్ధ జంట అనుకుని మిస్టర్ Z అని పిలువబడే స్థానిక పురాతన వస్తువుల డీలర్‌ను సంప్రదిస్తారు. అతను దానిని 158 డాలర్లకు కొనుగోలు చేస్తాడు.
ఆ తర్వాత Mr. Z అదే వస్తువును 2022లో మోంట్పెల్లియర్లోని ప్రత్యేక వేలంలో 3.6 మిలియన్ పౌండ్లకు(రూ. 36,86,17320) దానిని విక్రయిస్తాడు. విలువైన ఎన్గిల్ మాస్క్ 19వ శతాబ్దానికి చెందినదని నమ్ముతారు. దానిని శుద్ధి కర్మలకు ఉపయోగించారు. చెక్కతో చేయబడిన ఆ పరికరం 1920ల వరకు సెంట్రల్ ఆఫ్రికాలోని గాబన్లో పనిచేసే ఫాంగ్ రహస్య పురుష సమాజమైన ఎన్గిల్కు చెందినదిగా భావిస్తున్నారు.
ఆ తర్వాత దాని గురించి వార్తాపత్రికల్లో రావడంతో చూసిన వృద్ధ దంపతులు తమకు అన్యాయం జరిగిందని Mr Zపై కోర్టులో దావా వేశారు. అతను తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగానే ఆ వస్తువు గురించి తెలిసి కూడా చెప్పకుండా తక్కువ ధరకు కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. అయితే దాని గురించి తనకు తెలియదని, అనేక మందిని తెలుసుకున్న తర్వాత దానిని వేలంలో వేసినట్లు Z అనే వ్యక్తి పేర్కొన్నాడు. అయితే Mr. Z వృద్ధ జంటకు $315,000 పరిహారంగా చెల్లించాలని కోర్టు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించగా..ఆ జంట పిల్లలు వ్యతిరేకించారు. ఈ క్రమంలో తీర్పు వచ్చే వరకు అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్తంభింపజేయాలని కోర్టు ఆదేశించింది. ఏదీ ఏమైనా అలాంటి వస్తువు 36 కోట్లకు వేలంలో సేల్ కావడం పట్ల అనేక మంది ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అది ఎలా ఉందో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి మరి.