GDWL: ప్రిసైడింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సాయంత్రంలోగా తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకోవాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం ఎర్రవల్లి పదో బెటాలియన్లో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు సిబ్బందికి భద్రత కల్పిస్తామన్నారు.