»Chinas Xi Jinping Welcomes Dear Friend Putin As Belt And Road Summit Kicks Off
Vladimir Putin: చైనా చేరుకున్న పుతిన్..జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
ఉక్రైన్తో యుద్ధం తరువాత మొదటిసారి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మంగళవారం బీజింగ్‌లో చైనా అధ్యక్షడు తన మిత్రుడికి స్వాగతం పలికారు. ఈ సమ్మిట్‌లో అంతర్జాతీయ శాంతి భద్రతలతో సహా ఇజ్రాయెల్, పాలస్తీనాల యుద్ధంపై కూడా చర్చించారు.
China's Xi Jinping welcomes 'dear friend' Putin as Belt and Road Summit kicks off
Vladimir Putin: రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) మంగళవారం చైనా(China) బీజింగ్(Beijing)లో కాలు మోపారు. ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్(Xi Jinping) తన ప్రియమైన స్నేహితుడికి స్వయంగా స్వాగతం పలికారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో సహా అర్ధిక, అభివృద్ధి వంటి తదిర విషయాలపై బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు. బీజింగ్ వేదికగా వాణిజ్యం, సదుపాయాల ప్రాజెక్ట్, బెల్ట్ అండ్ రోడ్(Belt and Road) ఇనిషియేటివ్ (BRI) ఫోరమ్ కోసం 130 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు పుతిన్. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి ఆయన దేశాన్ని వదిలి రావడం ఇదే మొదటిసారి.
ఈ ఫోరమ్‌ను ప్రారంభించే కార్యక్రమంలో ఇద్దరు అగ్ర నేతలు మంగళవారం సాయంత్రం కలుసుకున్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. జిన్‌పింగ్, పుతిన్ కరచాలన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాని తరువాత శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ఇతర నేతలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు పుతిన్. అనంతరం చైనా అధికారిక విందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచం శాంతియుతంగా లేదు. దాంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుందని, ఈ సమయంలో ప్రపంచ దేశాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు.
ఇక ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్దం గురించి ఈ సమ్మిట్‌లో పుతిన్ కీలక వ్యాఖ్యలు మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా చర్చించబోతున్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ చరిత్రలో హమాస్ అత్యంత ఘోరమైన దాడిని అక్టోబర్ 7న ప్రారంభించింది. ఈ ఘటనలో 1,400 మందికి పైగా కాల్చి చంపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కీలకమైన హమాస్ మద్దతుదారు ఇరాన్, దాని ప్రాంతీయ శత్రువు సౌదీ అరేబియా మధ్య చైనా మధ్యవర్తిత్వం వహించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న రష్యా తక్షణ కాల్పుల విరమణను కోరింది.