ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ కెప్టన్‌లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వీరికి మరణశిక్షను ఖతార్ ప్రభుత్వం విధించింది.
Israel Hamas War: హమాస్ లాగే హిజ్బుల్లా కూడా పూర్తి ప్రణాళికతో ఇజ్రాయెల్ తో పోరుకు సిద్ధమైంది. గాజా వలె హిజ్బుల్లా లెబనాన్‌లో సొరంగాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దాడిని నివారించడానికి హిజ్బుల్లా సొరంగాలను నిర్మించింది.
ఓ 14 ఏళ్ల యువకుడు స్కిన్ క్యాన్సర్‌కు సోప్‌ను కనిపెట్టాడు. అమెరికాకు చెందిన హేమన్ బెకెలే అనే యువకుడు కనిపెట్టిన ఆ సోప్ ధర 10 డాలర్లు మాత్రమే. మన భారత కరెన్సీలో దాని విలువ రూ.830లు. స్కిన్ క్యాన్సర్‌ను తగ్గించే ఆ సోప్‌ను చిన్న వయసులోనే పరిశోధనలు చేసి కనిపెట్టడం గొప్ప విషయమని హేమన్ బెకెలేను సైంటిస్టులు ప్రశంసిస్తున్నారు.
భారత్లో నీటి కష్టాలు మరో రెండేళ్లలో తీవ్రం కానున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అధిక వేడి వాతావరణం, కరువు వంటి అంశాల నేపథ్యంలో భూగర్భ జలాలపై ఆధారపడటం క్రమంగా పెరిగినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాలకు నీటి కష్టాలు తప్పవని రిపోర్ట్ హెచ్చరించింది.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది.
భారతీయ అమెరికన్లకు ఆ దేశం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేసింది. పలు రంగాల్లో విశేష కృషి చేసినందుకు మన దేశానికి చెందిన ఇద్దరు సైంటిస్టులకు జో బైడెన్ పురస్కారాలు ప్రదానం చేశారు.
అమెరికాలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను బియ్యం సంచుల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా ఏడు దేశాల పర్యాటకులకు ఫ్రీ వీసా పాలసీని ప్రారంభించింది. దీంతో శ్రీలంకలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఆ ఏడు దేశాలకు చెందిన పర్యాటకులకు ఉచిత వీసా లభించనుంది.
ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చాలా మంది యువత వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, అసభ్య కంటెంట్‌ను వాడి యువతను చెడు మార్గంలోకి పంపేలా వాటి కార్యక్రమాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన 40 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.
రష్యా అధ్యక్షుడికి అర్ధరాత్రి వేళ హార్ట్ ఎటాక్ వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ ఫేక్ వార్తలని, వాటిన నమ్మొద్దంటూ రష్యా అధికారిక వర్గాలు వెల్లడించాయి. పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపాయి.
నేపాల్ ప్రజలను మళ్లీ భూకంపం వణికించింది. రెండు రోజుల క్రితం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా నేటి ఉదయం మరోసారి నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయి వీధి కుక్కల దాడిలో గాయపడ్డ ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
యుద్ధం కారణంగా గాజా ప్రాంతంలో 1000 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ దాదాపు 5500 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.
ట్విట్టర్ ను చేజిక్కించుకున్నప్పటి నుంచి స్పేస్ ఎక్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అనునిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మండులో మళ్లీ భూకంపం సంభవించింది. అక్టోబర్ 16న భూకంపం సంభవించగా మళ్లీ ఈరోజు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.