'లాఫింగ్ గ్యాస్(Laughing gas)'ను బ్రిటన్ దేశంలో నేటి నుంచి నిషేధించారు. దీనిని ప్రధానంగా వినోదభ కార్యకలాపాల్లో వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఈ డ్రగ్‌ను ఉపగిస్తే జైలు శిక్షను ఎదుర్కొంటారని అధికారులు పేర్కొన్నారు.
పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగినట్లు ఇటివల వార్తలు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు అధ్యక్షుడిని హతమార్చేందుకు ప్రయత్నించారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ దాడుల ఘటనను పాలస్తీనా దళాలు నిజం కాదని ఖండించాయి.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం వల్ల ఇప్పటి వరకూ 11 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఈ యుద్ధం ప్రారంభమై రేపటితో నెల రోజులు పూర్తవుతుంది. యుద్ధం కారణంగా చిన్నారులు, మహిళలే అధిక సంఖ్యలో మృతిచెందారు.
గాజా నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ భూ బలగాలను చుట్టుముట్టేందుకు హమాస్ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. గాజా స్ట్రిప్‌లో దీర్ఘకాలిక యుద్ధానికి హమాస్ సిద్ధమైందని తీవ్రవాద సంస్థ హమాస్ అగ్ర నాయకత్వానికి సన్నిహితంగా ఉన్న రెండు వర్గాలు మీడియాతో చెప్పారు.
చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉన్నప్పటికీ, ఇతరులకు ఇవ్వడానికి సంకోచించేవారు ఉన్నారు. చాలా తక్కువ కంపెనీలు మాత్రమే తమకు కోట్లాది రూపాయల లాభాలు వస్తే తమ సిబ్బందికి పదో, పరకో బోనస్ గా ఇస్తారు. కొన్ని కంపెనీలు అయితే దీపావళి లేదా మరేదైనా పండుగ వచ్చినా మిఠాయిలు ఇచ్చేందుకు సిబ్బంది వెనుకాడుతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తన 1200 మంది ఉద్యోగులను ఫ్యామిలీ ట్రిప్ కి పంపించి ఔరా అనిపించుకుంటున్నారు.
ఇరాన్‌లోని మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 32 మంది మరణించగా..మరో 16 మంది గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది.
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 11న జరుగుతాయని పాకిస్థాన్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ న్యాయవాది పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు ఈ సమాచారాన్ని తెలిపారు.
చిన్నారులు ఎక్కువగా క్షయ వ్యాధి బారిన పడుతుంటారు. దీనిని నిర్ధారణ చేయాలంటే పిల్లల నుంచి కఫం శాంపిల్స్ సేకరించాలి. ఇది చాలా కష్టం. ఈక్రమంలో జర్మనీ పరిశోధకులు రక్తపరీక్షతో క్షయ వ్యాధిని నిర్ధారించారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై అతనికి కొందరు మద్దతుగా సమాధానాలు చెబితే మరికొందరు విమర్శలు చేశారు. ఈ క్రమంలో 'అంతర్జాతీయ కార్మిక సంస్థ'(ILO) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది.
అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందని.. తక్కువ సంతానం పర్యావరణాన్ని కాపాడుతుందన్న కొందరి భావనను ఎలాన్ మస్క్ ఒప్పుకోరు. సంతానం ఎక్కువైతే పర్యావరణానికి ఎలాంటి హాని లేదని, తర్వాతి తరాన్ని మనమే సృష్టించుకోవాలని మస్క్ తెలిపారు.
అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తి దాడి చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన వరుణ్ రాజ్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వరుణ్ చికిత్సకు సాయం చేస్తానని మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ ట్యాక్సీల వినియోగం విపరీతంగా పెరగనుంది. చైనాకు చెందిన ఓ కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీకి 1200 ఆర్డర్ల వరకూ వచ్చాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇప్పటి వరకూ 9,800 మందికిపై దుర్మరణం చెందారు. అందులో 4 వేల మంది వరకూ చిన్నారులు ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది గాయాలపాలయ్యారు.
మరికొన్ని రోజుల్లో మీరు థాయిలాండ్(thailand) టూర్ వెళ్లనున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజులు వీసా లేకుండానే థాయిలాండ్లో పర్యటించవచ్చని ఆ దేశ అధికారులు ప్రకటించారు. అంతేకాదు 30 రోజుల పాటు అక్కడ ఉండే అనుమతి కూాడా ఉందన్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
24 అంగుళాల ఆల్ ఇన్ వన్ ఐమ్యాక్ వెర్షన్‌ను యాపిల్ ఆవిష్కరించింది. ఇది ఎం3తో పనిచేయుందని వివరించింది. మరింత మెరుగైన పనితీరు లక్ష్యంగా ఎం3లో 2 శ్రేణులు ప్రో, మాక్స్ వెర్షన్లు ఉన్నాయని వెల్లడించింది.