»Elon Musk Those Who Have Children Should Have Incentives Musks Interesting Comments
Elon Musk: సంతానం ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఉండాలి
అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందని.. తక్కువ సంతానం పర్యావరణాన్ని కాపాడుతుందన్న కొందరి భావనను ఎలాన్ మస్క్ ఒప్పుకోరు. సంతానం ఎక్కువైతే పర్యావరణానికి ఎలాంటి హాని లేదని, తర్వాతి తరాన్ని మనమే సృష్టించుకోవాలని మస్క్ తెలిపారు.
Elon Musk: ఎక్కువ సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. తక్కువ సంతానం ఉంటేనే పర్యావరణానికి మంచిదని కొందరు భావిస్తుంటారని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎప్పుడు అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎలాన్ మస్క్ మరోసారి ఇదే అంశంపై స్పందించారు. జనాభాను పెంచినా పర్యావరణం ఆరోగ్యంగానే ఉంటుంది. తక్కువ పిల్లలను కనడం పర్యావరణానికి మంచిదని కొందరు అనుకుంటారు. మన జనాభాని రెట్టింపు చేసినా పర్యావరణం బాగుంటుందని మస్క్ అన్నారు. కానీ మన నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు తప్పనిసరని ఆయన వ్యాఖ్యానించారు.
అధిక సంతానం కలిగి ఉండటం పర్యావరణానికి హానికరం కాదని.. మన నాగరికతను కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో సంతానం ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఉండాలని వెల్లడించారు. కొన్ని దేశాల్లో వాళ్లకు ఆర్థికంగా ప్రతికూలతలు ఉంటాయి. అలా ఉండకూడదని, తర్వాతి తరాన్ని మనం తప్పక సృష్టించాలని మస్క్ అన్నారు. హంగరీ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు మస్క్ స్పందించారు. సంతానం లేనివారితో పోలిస్తే.. పిల్లలు ఉన్నవారికి ఆర్థికంగా ప్రతికూలతలు ఉండాలా? హంగరీలో సంతానం ఉన్నవాళ్లు ఆర్థికంగా సానుకూలతలు కలిగి ఉండాలని కోరుకుంటున్నామని ఆమె సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేకి మస్క్ స్పందించారు.