»Adikeshava Movie Release Postponed To November 24th
Adikeshava: ఆదికేశవ మళ్లీ వాయిదా..ఇందుకేనటా
పంజా వైష్ణవ్ తేజ్ యాక్ట్ చేసిన తాజా చిత్రం ఆదికేశవ విడుదల..ఇప్పటికే పలు మార్లు వాయిదా పడగా..ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ చిత్రం నవంబర్ 10న విడుదలకు బదులు..నవంబర్ 24న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు.
adikeshava movie release postponed to november 24th
మొదటి సినిమా ‘ఉప్పెన’తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ క్రమంలో ఈ హీరో యాక్ట్ చేసిన తాజా చిత్రం ఆదికేశవ(adikeshava)తో మరో భారీ హిట్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించగా..నిర్మాత నాగవంశీ(nagavamsi) నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ వాస్తవానికి నవంబర్ 10న విడుదల కావాల్సి ఉండగా.. నవంబర్ 24కి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఉత్కంఠ మ్యాచులు ఉన్న కారణంగా.. ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడుతుందని చిత్ర నిర్మాతలు భావించారు. ఈ క్రమంలోనే విడుదల తేదీని మార్చుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ నటి శ్రీలీల(sreeleela) కథానాయికగా నటిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కొంత కంటెంట్ రీషూట్ చేసి సరైన సమయంలో విడుదల చేయాల్సి ఉందని నిర్మాత నాగ వంశీ తెలిపారు. మరోవైపు నవంబర్ 24న విడుదల కానున్న కళ్యాణ్‌రామ్ డెవిల్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది.