»Brs Will Be Ruled In Telangana Another Timejanta Ka Mood
Janta Ka Mood:తెలంగాణలో బీఆర్ఎస్కే అధికారం, 72-75 సీట్లలో విజయం..?
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతోందని జనతా కా మూడ్ సర్వే చెప్పింది. ఆ పార్టీ 75 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
BRS Will Be Ruled In Telangana Another Time:Janta Ka Mood
Janta Ka Mood: మరో 29 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమాతో ఉన్నాయి. మెజార్టీ సర్వేలు హంగ్ వస్తాయని చెబుతున్నాయి. కొన్ని కాంగ్రెస్ వస్తాయని.. మరికొన్ని బీఆర్ఎస్కే తప్ప అధికార మార్పిడి ఉండదని అంటున్నాయి. జనతా కా మూడ్ (Janta Ka Mood) మాత్రం మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతోందని కుండబద్దలు కొట్టింది. దీంతో అధికార పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 72 నుంచి 75 సీట్ల వరకు గెలుచుకుంటుందని జనతా కా మూడ్ (Janta Ka Mood) చెబుతోంది. తెలంగాణలో లక్ష 20 వేల మంది శాంపిళ్లను తీసుకొని సర్వే చేశామని వివరించింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ విపక్షానికే పరిమితం అవుతుందని అంటోంది. కాంగ్రెస్ 31 నుంచి 36 సీట్లను మాత్రమే గెలుస్తోందని చెప్పింది. బీజేపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల సమయంలో గోషామహల్ నుంచి రాజా సింగ్ ఒక్కరే గెలిచారు. ఈ సారి కనీసం 7 నుంచి 9 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది.
మజ్లిస్ సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పులేమి లేవు. 4 నుంచి 6 సీట్ల వరకు గెలుచుకుంటుందని చెప్పింది. ఓట్ల శాతాన్ని కూడా లెక్కగట్టి.. వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీకి 41 శాతం ఓట్లు పడతాయట. అలాగే కాంగ్రెస్ పార్టీకి 34 శాతం, బీజేపీకి 14 శాతం, మజ్లిస్‌కు 3 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.
జనతా కా మూడ్ సర్వే మాత్రం అధికార పార్టీ తిరిగి విజయం సాధిస్తోందని అంటోంది. మిగతా మెజార్టీ సర్వేలు అధికార మార్పిడి అని చెబుతోంది. అందుకు గల కారణాలను కూడా వివరిస్తోంది. వరసగా రెండుసార్లు అధికారంలో ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత, కుటుంబ పాలన వల్ల నెగిటివ్ ఎక్కువగా ఉందని.. ఓట్లుగా మలచడం కష్టం అవుతోందని చెప్పింది.