రష్యాలోని ఓ మహిళ తాను దత్తత తీసుకున్న కుమారుడినే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనాథ పిల్లలకు సంగీతం నేర్పించే ఆ మహిళ అతనిని దత్తత తీసుకుంది. కొన్నేళ్లు సహజీవనంలో ఉన్న తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు.
ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ కెప్టన్‌లకు ఖతార్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్లకు అండగా ఉంటామని తెలిపారు.
Mouse : పరిశోధనా రంగంలో జపాన్ శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. ఎలుక పిండాలను స్పేస్ లో అభివృద్ధి చెందించారు. దీంతో మానవులు కూడా అంతరిక్షంలో పునరుత్పత్తి చేయగలరని శాస్త్రవేత్తలు నిరూపించారు.
భారత్ నుంచి స్మగ్లింగ్ కాబడిన 1414 విగ్రహాలు తిరిగి మన దేశానికి ఇస్తున్నట్లు న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం అంగీకరించింది. ఇదివరకే 105 విగ్రహాలను ఇచ్చింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 3,595 మంది చిన్నారులు మరణించినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాజా ప్రాంతంలో ఇప్పటి వరకూ 7,703 మంది చనిపోయారని, మరణాల సంఖ్య మరింత పెరగనుందని తెలిపింది.
పాకిస్థాన్ యూట్యూబర్ అలిజా సహర్ చిక్కుల్లో పడింది. ప్రైవేట్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మై విలేజ్ షో టీమ్ దుబాయ్‌లో ఉంది. దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా.. గంగవ్వ ముఖ్య అతిథిగా వచ్చారు. హాల్ నిండగా.. ఈలలు, కేరింతలతో సందడి నెలకొంది.
ప్రముఖ కమెడియన్ నటుడు మాథ్యూ పెర్రీ(Matthew Perry) 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శనివారం లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో నటుడు శవమై కనిపించాడని అక్కడి మీడియా తెలిపింది. అయితే అతను హాట్ టబ్‌లో మరణించడం పట్ల ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈజిప్టులోని బెహెరా ప్రావిన్స్‌లో శనివారం బహుళ వాహనాలు ఢీకొన్న ఘటనలో 35 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. ప్రభుత్వ మీడియా ఈ సమాచారాన్ని అందించింది.
కజకిస్తాన్ గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృత్యువాత చెందారు. దీంతో ఈ ఘటనపై అక్కడి దేశాధ్యక్షుడు ఆ గని నిర్వహిస్తున్న సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రధాని మోడీ రోజుకు 14-16 గంటలు పని చేస్తారు, కనీసం యువకులు వారానికి 70 గంటలు వర్క్ చేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ్ మూర్తి వ్యాఖ్యలపై పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ అంగీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.
ఎక్స్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నారు ఎలాన్ మస్క్. వచ్చే ఏడాదికల్లా డేటింగ్ ఫీచర్ అందుబాటులోకి వస్తోందట.. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ కూడా ఇస్తారని తెలిసింది.
చైనాలో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశంలో పోలీసులు ట్రక్కులో తరలిస్తున్న వేల సంఖ్యలో పిల్లుల ప్రాణాలను కాపాడారు. వాటి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్‌గా నమ్మించి విక్రయించే ప్రయత్నాన్ని తిప్పి కొట్టారు.
మీరు ఎల్ సాల్వడార్ దేశం గుండా అమెరికా వెళ్తున్నారా? అయితే ఆగండి. ఎందుకంటే ఈ దేశం నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులపై ఎల్ సాల్వడార్ ప్రభుత్వం రూ.83 వేల ట్యాక్స్ విధిస్తుంది. అయితే ఈ పన్ను విధించడానికి ఓ కారణం కూడా ఉందని చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.
చైనా మాజీ ప్రధాని లీ కియాంగ్ గుండెపోటుతో మరణించారు.