»Kazakhstan Fire Accident Arcelormittal Mine 32 Dead 18 Injured
Fire accident: భారీ అగ్నిప్రమాదం..32 మంది మృతి
కజకిస్తాన్ గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృత్యువాత చెందారు. దీంతో ఈ ఘటనపై అక్కడి దేశాధ్యక్షుడు ఆ గని నిర్వహిస్తున్న సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
kazakhstan fire accident ArcelorMittal mine 32 dead 18 injured
కజకిస్థాన్‌లోని ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌మిట్టల్‌కు చెందిన కోస్టెంకో గనిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 32కి చేరుకోగా, గాయపడిన మైనర్ల సంఖ్య 18కి చేరుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటన సమయంలో 252 మంది మైనర్లు ఉండగా వారిలో 205 మందిని పైకి తీసుకొచ్చారు. ఈ గని సెంట్రల్ కజకిస్తాన్‌లోని ఒక పారిశ్రామిక ప్రాంతమైన కరాగండా పట్టణానికి సమీపంలో ఉంది. కజకిస్థాన్‌లోని ఆర్సెలర్ మిట్టల్ గనిలో గత రెండు నెలల్లో జరిగిన రెండో ఘోర ఘటన ఇది. అంతకుముందు ఆగస్టులో జరిగిన ఘటనలో కజఖ్ గనులలో ఒకదానిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మైనర్లు మరణించారు.
ఈ ఘటనపై కజక్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీని జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆ గని నిర్వహిస్తున్న ఆర్సెలార్ మిట్టల్ టెమిర్టౌతో పెట్టుబడి సహకారాన్ని నిలిపివేయాలని ఆయన తన మంత్రివర్గాన్ని ఆదేశించారు. ప్రభుత్వం, కంపెనీ వారు ఒక ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
#UPDATE “This company has turned out to be the worst in our history from the point of view of cooperation with the government,” Kazakhstan’s President Kassym-Jomart Tokayev said as he met with relatives of the victims in the Karaganda region, where the disaster occurred. pic.twitter.com/33wnprHOW8