»A Businessman Who Sent 1200 Employees On A Family Trip
Ken Griffin: 1200 మంది ఉద్యోగులను ఫ్యామిలీ ట్రిప్ కి పంపిన బిజినెస్ మ్యాన్
చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉన్నప్పటికీ, ఇతరులకు ఇవ్వడానికి సంకోచించేవారు ఉన్నారు. చాలా తక్కువ కంపెనీలు మాత్రమే తమకు కోట్లాది రూపాయల లాభాలు వస్తే తమ సిబ్బందికి పదో, పరకో బోనస్ గా ఇస్తారు. కొన్ని కంపెనీలు అయితే దీపావళి లేదా మరేదైనా పండుగ వచ్చినా మిఠాయిలు ఇచ్చేందుకు సిబ్బంది వెనుకాడుతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తన 1200 మంది ఉద్యోగులను ఫ్యామిలీ ట్రిప్ కి పంపించి ఔరా అనిపించుకుంటున్నారు.
A businessman who sent 1200 employees on a family trip
కోటీశ్వరులందరూ ఒకేలా ఉండరు. కొందరు తమ సిబ్బందిని(employees) మాత్రమే కాకుండా వారి కుటుంబ సంక్షేమాన్ని కూడా చూసుకుంటారు. కంపెనీ లాభపడినప్పుడు ఉద్యోగులకు బహుమతులు, విహారయాత్రలకు పంపడం లేదా అత్యవసర పరిస్థితుల్లో వారి కుటుంబాలకు సహాయం చేసే బిలియనీర్లు కూడా ఉన్నారు. ప్రతి కంపెనీ ఎదుగుదలలో సిబ్బంది పాత్ర పెద్దది. సిబ్బంది సంతోషంగా ఉంటే కంపెనీ పని ఒత్తిడి లేకుండా సాగుతుంది. కంపెనీ లాభం పొందుతుంది. ఒక అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్తకు ఈ విషయం బాగా తెలుసు. వారు తమ ఉద్యోగులకు గొప్ప బహుమతులు ఇవ్వడం ద్వారా సంతోషిస్తారు. ప్రతి ఏటా తన కంపెనీ వార్షికోత్సవం ఉద్యోగుల బహుమతుల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు.
ఈ బిలియనీర్ ఎవరు?
ఈ బిలియనీర్ పేరు కెన్నెత్ సి.గ్రిఫిన్(Ken Griffin). బహుళజాతి కంపెనీ సిటాడెల్ LLC CEO, సిటాడెల్ సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు. కెన్నెత్ సి.తన 1,200 మంది సిబ్బందిని తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు పంపారు. అవును కెన్నెత్ సి తన 1200 మంది సిబ్బందిని డిస్నీల్యాండ్ టోక్యోకు విహారయాత్రకు పంపారు. కెన్నెత్ సిటాడెల్ 30వ, సిటాడెల్ సెక్యూరిటీస్ 20వ వార్షికోత్సవాల ముందు సిబ్బందికి ఈ బహుమతిని అందించాడు. బిగ్ థండర్ మౌంటైన్ పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, డిస్నీ వరల్డ్‌లోని స్పేస్ మౌంటైన్తో సహా కీలకమైన ప్రాంతాలు ఇతర ప్రత్యేక ఆకర్షణలను సందర్శించడానికి ఉద్యోగులు లైన్లో వేచి ఉండకుండా ఉండేందుకు అవకాశం కల్పించారు. దాని కోసం గ్రిఫిన్ తన ఉద్యోగులకు పాస్‌లు ఇచ్చాడు. గ్రిఫిన్ ఒక రోజు ఈవెంట్ కోసం దాదాపు 72,71,966 రూపాయలు, అంటే 87,336 డాలర్లు ఖర్చు చేయడం విశేషం.
కంపెనీ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని గ్రిఫిన్ నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చేశారు. వార్షికోత్సవ కార్యక్రమం, ప్రయాణం, హోటల్, ఆహారం, పార్క్ టిక్కెట్లు, వినోదం పిల్లల సంరక్షణతో సహా అన్ని ఖర్చులను కంపెనీ భరించింది. గతేడాది డిసెంబర్లో కూడా గ్రిఫిన్ కంపెనీ(Citadel LLC)ఇదే తరహాలో పండుగను జరుపుకుంది. గ్రిఫిన్ అమెరికా , యూరప్‌లోని తన సహోద్యోగులను వారి కుటుంబాలతో కలిసి ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని డిస్నీ వరల్డ్‌కు తీసుకెళ్లాడు.