»40 States Sue Facebook Instagram Parent Company Meta
Meta: ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై 40 రాష్ట్రాలు దావా
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా మంది యువత వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, అసభ్య కంటెంట్‌ను వాడి యువతను చెడు మార్గంలోకి పంపేలా వాటి కార్యక్రమాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన 40 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాపై అమెరికాకు చెందిన 40 రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో ఆ రాష్ట్రాలు దావా వేయడం కలకలం రేపింది. మెటా తన ఆర్థిక లాభాలను పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తెలిపింది. ప్రమాదాల గురించి ప్రజలను పదేపదే ఇబ్బంది పెడుతోందని, దాని వల్ల ప్రజలు వేరే మార్గాలను అనుసరించే అవకాశం ఉందని ఆరోపణలు చేశాయి.
ఫేస్ బుక్, ఇన్‌స్టా వినియోగం ద్వారా అధిక శాతం మంది పిల్లలు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయా రాష్ట్రాలు ఫిర్యాదులో పేర్కొన్నాయి. చాలా మంది మానసిక రుగ్మతలకు గురయ్యేందుకు మెటా లాంటి సోషల్ మీడియా కంపెనీలే కారణమని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఈ దావాను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మెటాలో గడిపేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, దీని వల్ల యువత ఎక్కువగా ప్రమాదంలో పడుతున్నారని పలు రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి.
మెటా ప్రమోట్ చేస్తున్న కంటెంట్‌లో ఎక్కువగా ప్రమాదభరిత సమాచారం ఉందని, ఆ కంటెంట్ వల్ల యువత ఎక్కువగా వ్యసనాలకు అలవాటయ్యే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు కోర్టుకు విన్నవించాయి. అంతేకాకుండా యువత ఎక్కువ సమయం తమ ప్లాట్‌ఫామ్ లల్లో గడిపేందుకు మెటా అడల్ట్ కంటెంట్‌ను కూడా వినియోగిస్తోందని, దానిని వెంటనే అరికట్టాలని కోర్టుకు ఆయా రాష్ట్రాలు తెలిపాయి.