»Scientific Awards A Rare Honor For Indian Americans Biden Presented The Awards
Scientific Awards: భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం
భారతీయ అమెరికన్లకు ఆ దేశం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేసింది. పలు రంగాల్లో విశేష కృషి చేసినందుకు మన దేశానికి చెందిన ఇద్దరు సైంటిస్టులకు జో బైడెన్ పురస్కారాలు ప్రదానం చేశారు.
Scientific Awards: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసినందుకు ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు అరుదైన గౌరవం లభించింది. అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్‌లకు అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి. అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డులైన ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అశోక్ గాడ్గిల్కి, ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ సుబ్ర సురేశ్‌కు దక్కాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అవార్డులను ప్రదానం చేశారు.
Today, @POTUS awarded the National Medal of Science and the National Medal of Technology and Innovation to 21 Americans – for their outstanding contributions to knowledge in the sciences and to the improvement of our nation’s economic, environmental, and social well-being. pic.twitter.com/ZfSQV0sv9S
ముంబైలో జన్మించిన అశోక్ గాడ్గిల్ ముంబై యూనివర్సిటీ, ఐఐటీ కాన్పూర్ నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. తర్వాత కాలిఫోర్నియా వర్సిటీ పీహెచ్డీ చేశారు. 1980లో లారెన్స్ బర్క్లీ నేషనల్ లాబొరేటరీలో పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలోని సివిల్, పర్యావరణ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తక్కువ ఖర్చుతో సురక్షిత తాగునీరు సాంకేతికత, సమర్ధవంతమైన ఇందనం స్టవ్, విద్యుత్ దీపాల అభివృద్ధిలో విశేషమైన కృషి చేశారు. ఈయన చేసిన పరిశోధనలు 10కోట్లకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు జీవనాధార వనరులను అందించినందుకు అశోక్‌కు ఈ అవార్డును అందించారు.
ముంబాయికి చెందిన సుభ్ర సురేశ్ ఐఐటీ మద్రాస్‌లో బీటెక్, లోవా స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్, ఎంఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఫ్యాకల్టీ సభ్యుడిగా చేరారు. ఇందులో ఫ్యాకల్టీగా చేరిన అతి పిన్న వయస్కుడు ఇతనే. తర్వాత నేషనల్ సైన్స్ ఫౌండేషన్(NSF)కు డైరక్టర్ అయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి ఆసియా-అమెరికన్ సురేశ్. తిరిగి 2023లో బ్రౌన్ వర్సిటీకి వచ్చి ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్‌లో పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మెటీరియల్ సైన్స్‌లో అధ్యయనానికి గుర్తింపుగా సురేశ్ ఈ అవార్డు అందుకున్నారు.