Drugs: డ్రగ్స్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 3,312 కిలోల కొకైన్ సీజ్ చేశారు. దీని విలువ రూ.11,623 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
VIDEO: Paraguayan police seize 3,312 kilograms of cocaine stashed in rice bags, bound from South America to Europe. The shipment is valued at US$1.4 billion pic.twitter.com/eU4eROzodF
రైస్ ట్రాన్స్‌పోర్టింగ్ పేరుతో డ్రగ్స్ స్మగ్గ్లింగ్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బియ్యం సంచుల్లో కొకైన్‌ను తరలిస్తుండగా పరాగ్వే పోలీసులు పట్టుకుని స్వాధీనం చేశారు. దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు కొకైన్ తరలిస్తుండగా వీటిని పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ స్మగ్లర్లపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. భారీగా డ్రగ్స్ పట్టుబడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సాధారణంగా కొకైన్ అంటే చిన్న ప్యాకెట్లలలో.. కిలోల ప్యాకెట్లలో సరఫరా చేసేవారు. వీరు మాత్రం ఏకంగా బియ్యం బస్తాల్లో ప్యాక్ చేసి తరలిస్తున్నారు. వీటిని ఎవరు చూసినా రైస్ బ్యాగ్స్ అనుకుని వదిలేస్తారని భావించి ఉంటారు.