ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న టెస్లా, ట్విట్టర్, స్పేస్ ఎక్స్ సంస్థల అధితనే ఎలాన్ మస్క్(Elon Musk)కు భారీ షాక్ తగిలింది. ఆయన సంపదలో ఒక్క రోజే ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల (Billion dollars) మేర ఆయన నష్టాన్ని చవిచూశారు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.13 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. దీంతో మరోసారి ఆయన అగ్రస్థానం ప్రమాదంలో పడినట్లయింది. అందుకు ప్రధాన కారణం టెస్లా షేర్లు (Tesla shares) భారీగా పతనమవడమే.కార్ల విక్రయాలు కూడా పేలవంగా ఉండడంతో కంపెనీ షేర్ల విక్రయానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఫలితంగా 9.3 శాతం మేర షేర్లు పతనమయ్యాయి. అయినప్పటికీ ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానంలోనే కొనసాగుతుండడం గమనార్హం.
ఈ ప్రభావం ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపదపై గట్టిగానే ప్రభావం చూపింది. ఆయన 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టపోవాల్సి వచ్చింది. కాగా ఎలాన్ మస్క్ సంపదలో టెస్లా వాటా దాదాపు 13 శాతంగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. భారీ నష్టాన్ని చవిచూసినప్పటికీ 2023లో ఎలాన్ మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇందులో టెస్లా షేర్ల భాగస్వామం కీలకంగా ఉంది. కంపెనీ అన్ని విధాలా దృఢంగా ఉండడంతో షేర్లు భారీగా ఎగశాయి. ఈ కారణంగానే ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న ఫ్యాషన్ దిగ్గజం ఎల్వీహెచ్ఎం కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్(Bernard Arnold)కు మస్క్ అందనంత ఎత్తులో నిలిచారు.అయినప్పటికీ ఎలాన్ మస్కే ఇప్పటికీ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. కానీ, టెస్లా షేర్ల పతనం ఇలాగే కొనసాగితే తక్కువ సమయంలోనే తన అగ్రస్థానాన్ని మస్క్ కోల్పోవాల్సి రావచ్చు. మళ్లీ బెర్నార్డ్ ఆర్నాల్డ్ తొలి స్థానానికి చేరుకుంటారు.