»Husbands Inappropriate Comments On Womens Separated Italian Pm Giorgia Meloni Husband
Giorgia Meloni: భర్త అనుచిత వ్యాఖ్యలు..విడిపోయిన మహిళా ప్రధాని
ఇటాలియన్ మహిళా ప్రధాన మంత్రి జార్జియా మెలోని(Giorgia Meloni) శుక్రవారం ఆమె తన చిరకాల బాయ్ ఫ్రెండ్, జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనో నుంచి విడిపోయినట్లు ప్రకటించారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా అతను మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకే మెలోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
Husbands inappropriate comments on womens Separated Italian PM Giorgia Meloni husband
ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని(Giorgia Meloni) తన చిరకాల ప్రియుడు, టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనో(Andrea Giambruno) నుంచి విడిపోతున్నట్లు తెలిపారు. అతను ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమె ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో దాదాపు 10 ఏళ్ల పాటు ఆండ్రియా జియాంబ్రూనోతో కొనసాగిన తన సంబంధం ముగుస్తుందని X వేదికగా ప్రకటించారు. అంతేకాదు తమ మార్గాలు కూడా కొంత కాలంగా మారాయని అన్నారు. దానిని గుర్తించే సమయం వచ్చిందని ఈ మేరకు మెలోని స్పష్టం చేశారు.
La mia relazione con Andrea Giambruno, durata quasi dieci anni, finisce qui. Lo ringrazio per gli anni splendidi che abbiamo trascorso insieme, per le difficoltà che abbiamo attraversato, e per avermi regalato la cosa più importante della mia vita, che è nostra figlia Ginevra.… pic.twitter.com/1IpvfN8MgA
గతంలో సాముహిక అత్యాచార ఘటనల విషయంలో మహిళలపై ఆండ్రియా జియాంబ్రూనో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. మీరు సరదాగా బయటకు వెళ్లినప్పుడు అతిగా మద్యం సేవించొద్దని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆండ్రియా పేర్కొన్నారు. అంతేకాదు అత్యాచార ఘటనలు నివారించాలంటే మీరు స్పృహ కోల్పోకుండా ఉండాలన్నారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలను సర్ధిచెప్పుకునే నేపథ్యంలో యువత డ్రగ్స్, మద్యం కోసం బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశమని తెలిపారు. ఆ క్రమంలోనే బయట చెడు వ్యక్తుల నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ కామెంట్లతోపాటు అతను మహిళల పట్ల ఉపయోగించిన పదజాలం వీడియోలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. దీంతో అతనిపై మహిళలు(womens) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటాలియన్ ప్రధాన మంత్రి(Italian PM) ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఆగస్ట్‌లో సామూహిక అత్యాచారం కేసు తర్వాత బాధితురాలిని నిందించే వ్యాఖ్యల విషయంలో టీవీ జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రూ(Andrea Giambruno) విమర్శించబడ్డాడు. మీరు డ్యాన్స్ చేయడానికి వెళితే, తాగడానికి మీకు అన్ని హక్కులు ఉంటాయని ఆండ్రియా అన్నారు. ఆ క్రమంలో మీరు తాగి, స్పృహ కోల్పోవడం వంటివి మానుకుంటే, మీరు కొన్ని సమస్యలను నివారించవచ్చన్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత మెలోని తన భాగస్వామి చేసిన వ్యాఖ్యలకు ప్రజలు తనను అంచనా వేయకూడదని పేర్కొన్నారు. దీంతోపాటు భవిష్యత్తులో అతని ప్రవర్తనకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఇష్టపడనని తెలిపింది.