గాజాస్ట్రిప్‌లో అదుపులోకి తీసుకున్న పాలస్తీనియన్లను బందీ చేశారు. వీళ్ల కళ్లకు గంతలు, చేతులు కట్టేసి లోదుస్తుల్లో వారిని ట్రక్కుల్లోకి తరలిస్తున్నారు. ఇలా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
యూనివర్సిటీలో మంటలు చెలరేగడం వల్ల 14 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో మరో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దొంగలు దోచుకున్న వాటిని ఉంచుకోరు. దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కోసారి భారీ అంచనాలతో చోరీ చేసే దొంగలకు నిరాశే ఎదురవుతుంది. ఐరన్ అని తెలియగానే బంగారం అనుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేసిన సంఘటనలు గతంలో కొన్ని నమోదయ్యాయి. ఇప్పుడు అమెరికాలోని వాషింగ్టన్‌లో దొంగల ప్రవర్తన చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోతున్నారు.
ఆఫ్గానిస్థాన్‌లో మహిళలు చదువుకోకూడదు. బాలికలు ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకుంటే సరిపోతుందని రెండేళ్ల కిందట ఆంక్షలు విధించారు. ప్రస్తుతం తాలిబన్ మంత్రి మహిళల విద్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చైనా రాయబారిగా పనిచేసి తర్వాత విదేశాంగ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్విన్ గాంగ్ గత కొన్ని నెలలుగా కనిపించడం లేదు. అతని చనిపోయి ఉంటారని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి.
టమాటా ఉన్న ఫలంగా కనిపించకుండా పోయింది. అయితే ఏంటి? టమాటా మిస్సైనా కూడా న్యూస్ అవుతుందా అంటే అవును. అది దొరకకుండా పోయింది భూమిపై కాదు అంతరిక్షంలో..అది కూడా 8 నెలల కనిపించకుండా పోయింది. తాజాగా దొరకడం పట్ల శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గాజా నగరంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని పాకిస్థాన్ మాత్రమే అడ్డుకోగలదట. ఇజ్రాయెల్‌ను ఆపడం కేవలం పాకిస్థాన్‌కే సాధ్యమని.. పాక్‌కు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది.
అమెరికాలో వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. లాస్ వెగాస్‌లోని ఓ విశ్వవద్యాలయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
రాబోయే రోజుల్లో సూర్యుని పైనుంచి సౌర గాలులు వేగంగా భూమిపైకి వ్యాపించనున్నాయి. ఇందుకు కారణాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. సూర్యునిపై అతి పెద్ద రంధ్రం ఏర్పడటం వల్లే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. అతను విధించే శిక్షల గురించి నెట్టింట్లో కథనాలు వస్తాయి. అలాంటి వ్యక్తి ఒక సభలో కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తల్లి మొబైల్‌లో ఫొటో చూసి మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటానని కుటుంబ సభ్యులను చెప్పాడు. కుమారుడి సంతోషం మేరకు తల్లిదండ్రులు ఒప్పుకున్నా.. ఆమెది పాకిస్థాన్ కావడంతో ఇబ్బందులు తప్పలేదు.
వరుస భూకంపాలతో ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్ వణుకుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఫ్లేర్ గన్‌తో ఒక వ్యక్తి ఇంట్లో కాల్పులు జరుపుతుండడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే పోలీసులపై కాల్పులు మొదలు పెట్టాడు. అకస్మాత్తుగా ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఇల్లు కాలి బూడిదయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండోనేషియాలోని మౌంట్ మరపి అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడం వల్ల పర్వతారోహకులు చనిపోయారు. కొంతమంది గల్లంతు అయ్యారు.
బ్రిటన్ ఎన్నికల నేపథ్యంలో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ముఖ్యంగా వీసాకు సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త రూల్స్ అమలులోకి వస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.