చైనాలో న్యుమోనియా(Pneumonia) వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక(karnataka) ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేసింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం మనకు మార్కెట్లో చాల రకాల శాండ్ విచ్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటన్నింటిలోనూ చీజ్ శాండ్ విచ్(Sandwich)కి ఎక్కువ క్రేజ్ ఉంది. కాగా తాజాగా ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలోనే అతి పెద్ద శాండ్ విచ్ ని తయారు చేశారు.
ఓ 65 ఏళ్ల పెద్దాయన చదువుకోవాలనుకున్నాడు. లేటు వయసులో ఆయన 1వ తరగతిలో జాయిన్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాలనుకునే కలను ఇప్పుడు నెరవేర్చుకోవడంతో అందరూ ఆయన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు.
పాకిస్థాన్‌లోని కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లోని ఆర్జే మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. తొమ్మిది మృతదేహాలను ఆసుపత్రులకు తరలించినట్లు కరాచీలోని స్థానిక ఆసుపత్రుల అధికారులు, పోలీసులు తెలిపారు.
అమెరికా వెళ్లే విద్యార్థులు, ఇతరులు వీసా అపాయింట్ మెంట్ కోసం పాస్ పోర్ట్‌లో ఉన్న కచ్చితమైన వివరాలను పేర్కొనాలని ఎంబసీ పేర్కొంది. లేదంటే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అవుతుందని స్పష్టంచేసింది.
చైనాలోని చిన్నారుల్లో విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధిపై భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ కన్నేసి ఉంచింది. చైనాలో పెరుగుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులతో పాటు, శ్వాసకోశ వ్యాధుల సమూహాల నుండి భారతదేశానికి ముప్పు తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న వలసదారుల సంఖ్య 64 లక్షల మంది ఉన్నారని ఓ సర్వే తెలిపింది. వీరిలో భారతీయులు 7.25 లక్షల మంది ఉన్నారు.
జాతీయ రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలపై జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను నవంబర్ 28న కోర్టులో హాజరుపరచాలని పాక్ కోర్టు ఆదేశించింది.
సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే వార్తలు కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని నోరు తెరిచేలా చేస్తాయి. అద్దె ఇళ్ల గురించి తెలిసిందే. ఏరియాను బట్టి రేట్లు ఉంటాయి. కానీ ఈ అద్దె రూమ్‌లో బెడ్ ధర తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
టెక్ రంగంలో మరో భారీ డీల్ కుదిరింది. US-ఆధారిత హార్డ్‌వేర్ కంపెనీ బ్రాడ్‌కామ్.. డెస్క్‌టాప్ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ VMwareను సొంతం చేసుకుంది. అందుకోసం ఏకంగా 69 బిలియన్ డాలర్లను(రూ.5.7 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది.
సామ్ ఆల్ట్‌మన్‌ను సిఇఒగా తిరిగి తీసుకురావడానికి కొత్త బోర్డు సభ్యులను నియమించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు OpenAI ఈరోజు ప్రకటించింది. అయితే అతన్ని తొలగించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లకు బదులుగా గాజా స్ట్రిప్‌లో బందీలుగా ఉన్న డజన్ల కొద్దీ బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్, హమాస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తమ వినాశకరమైన యుద్ధాన్ని తాత్కాలికంగా నాలుగు రోజలపాటు ఆపడానికి ఒక ఒప్పందానికి వచ్చాయి.
పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీకి భారతదేశం US $ 2.5 మిలియన్లను(రూ.20,82,85,375) విరాళంగా ఇచ్చింది. ఆ శరణార్థులకు విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలతో సహా ఏజెన్సీ ప్రధాన కార్యక్రమాల సేవలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం సహకారాన్ని అందించింది.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. రష్యా కంటే చిన్న దేశమైన ఉక్రెయిన్‌కు చెందిన సైనికులు ఒక సంవత్సరానికి పైగా యుద్ధాన్ని లాగుతున్నారు.
ఇద్దరు మహిళలు కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఒకే బిడ్డను ఇద్దరు మహిళలు తమ కడుపులో ఎలా మోశారని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వలింగ సంపర్కులైన ఆ జంట ఫెర్టిలిసీ సెంటర్ ద్వారా మగబిడ్డకు జన్మనివ్వడం విశేషం.